ప్రభాస్ సాహో రిలీజ్ డేట్ నెలల నుంచి రోజుల్లోకి మారిపోయింది. ఆగస్ట్ 30 తేదీ క్యాలెండర్ లో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే కనివిని ఎరుగని రిలీజ్ కు యూనిట్ ప్లాన్ చేస్తోంది. దానికన్నా ముందు ఎల్లుండి 18న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద అందరి కన్ను పడింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ ఒక్క వేడుక కోసమే సుమారు 3 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఆ మేరకు స్టేజి పనులు అదరహో అనే రేంజ్ లో జరుగుతున్నాయట.
సాహో యాక్షన్ మూవీ కాబట్టి పైన సెట్టింగ్ కూడా దానికి అనుగుణంగా ఖరీదయిన బైక్ కార్స్ ఇంటీరియర్స్ తో పాటు కోట్లాది రూపాయల నిజమైన వాహనాలను డిస్ప్లే చేస్తారట. సుమారు లక్షకు పైగా జనం అభిమానులు హాజరయ్యేలా టీమ్ ఏర్పాట్లు చేసిందట. ఇప్పటికే ముందస్తుగా వెన్యూకి చేరుకునేలా ప్లాన్ చేసుకోమని అభిమాన సంఘాలకు మెసేజ్ వెళ్లినట్టు న్యూస్
ఇక అతిధులుగా ఎవరు వస్తారు అనేదాని మీద మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ఆహ్వానం ఉన్నా రాకపోవచ్చని తెలిసింది. చిరంజీవిని గెస్ట్ గా పిలవాలని ప్రభాస్ ప్రత్యేకంగా కోరడంతో యువి నిర్మాతలు ఆ ప్రయత్నం కూడా చేశారట. ప్రస్తుతం సైమా అవార్డ్స్ కోసం ఖతార్ ఉన్న చిరు రేపో ఎల్లుండో వచ్చేస్తారు.
పుట్టినరోజు దగ్గరలో ఉండటంతో పాటు సైరా టీజర్ రిలీజ్ 20న ఉంది కాబట్టి హైదరాబాద్ లోనే ఉంటారు. సో చిరు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. వీళ్ళు కాకుండా ప్రభాస్ కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ తో పాటు యూత్ హీరోలు అధిక సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి సాహో ఈవెంట్ సినిమా రేంజ్ లో హడావిడి చేయబోతోంది. ఆదివారం కాబట్టి టీవీ టెలికాస్ట్ లో సైతం రికార్డులు నమోదు కావొచ్చని అంచనా