ఏ హీరో మార్కెట్ అయినా.. అతడి గత సినిమా సాధించిన విజయం, తెచ్చిన కలెక్షన్లను బట్టి ఫిక్స్ అవుతుంది. గత సినిమా ఫిగర్ మీద పది శాతమో, ఇరవై శాతమో పెంచి బిజినెస్ చేసుకుంటాడు ఆ నిర్మాత. ఐతే అందరు హీరోల విషయంలోనూ ఈ సూత్రాలు వర్తించవు. కొన్ని సినిమాల విజయంలో, వసూళ్లలో దర్శకుడి పాత్ర గురించి కూడా ఆలోచించుకోవాలి. ఓ సినిమాకు వచ్చిన వసూళ్లన్నీ కూడా హీరో వల్లే వచ్చాయా లేదా అన్నది చూసుకుని బయ్యర్లు పెట్టుబడి పెట్టుకోవాలి. లేకుంటే అసలుకే మోసం వచ్చేస్తుంది. ‘స్పీడున్నోడు’ విషయంలో ఇదే జరుగుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ రూ.20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడంతో.. అతడి రెండో సినిమా ‘స్పీడున్నోడు’కు రేట్లు భారీగా ఫిక్స్ చేశాడు దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాసరావు. శీను తొలి సినిమా రిజల్ట్ చూసుకుని.. పైగా స్పీడున్నోడు తమిళ హిట్ మూవీకి రీమేక్ కూడా కావడంతో రూ.25 కోట్ల దాకా బిజినెస్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తొలి రోజే డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా పెట్టుబడిలో సగం కూడా వసూలు చేసే పరిస్థితి లేదు. ఓ పది పన్నెండు కోట్లకు మించి వసూళ్లు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అంటే బయ్యర్లు సగానికి సగం మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘స్పీడున్నోడు’కు నిర్మాత భీమనేనే అయినా.. తెరవెనుక అంతా బెల్లంకొండ సురేషే అని ఇండస్ట్రీ జనాల నమ్మకం. సురేష్ కు ఇప్పటికు బయ్యర్లు, ఫైనాన్షియర్లతో చాలా వివాదాలున్నాయి. మరి ‘స్పీడున్నోడు’ విషయంలో మరో గొడవ రేగేలా కనిపిస్తోంది.