టాలీవుడ్ లో అత్యంత ఖరీదైన అరంగేట్రం బెల్లంకొండ శ్రీనివాస్ దే. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టేశారు అతడి తొలి సినిమా ‘అల్లుడు శీను’కు. ఐతే ఆ సినిమా పెట్టుబడిలో సగమే వసూలు చేసింది. ఆ పుణ్యం కూడా వి.వి.వినాయక్ దే. అతడికున్న క్రేజ్ వల్లే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. శ్రీనివాస్ ఎస్టాబ్లిష్డ్ హీరో కాకపోయినా ఆ సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి. శ్రీనివాస్ రెండో సినిమా ‘స్పీడున్నోడు’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. వచ్చే శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ‘స్పీడున్నోడు’కు బ్రహ్మాండమైన బిజినెస్ ఆఫర్లు వచ్చాయని.. ఫ్యాన్సీ రేటుకు సినిమాను కొనేశారని దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాస్ ఘనంగా ప్రకటనలిచ్చేశాడు.
భీమనేని అతిశయోక్తులు ఏ స్థాయిలో ఉన్నాయంటే రూ.25 కోట్లకు తన సినిమా బిజినెస్ జరిగిందని అంటున్నాడు. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించట్లేదు. రవితేజ లాంటి స్టార్ హీరోలకు మాత్రం రూ.25 కోట్ల బిజినెస్ జరుగుతుంది టాలీవుడ్ లో. నాగార్జున - వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకే అంత మార్కెట్ లేదు. అలాంటిది శ్రీనివాస్ సినిమాకు రూ25 కోట్ల బిజినెస్ అంటే ఏ రేంజిలో కోతలు కోసేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులో సగం బిజినెస్ జరిగి ఉంటే ఎక్కువ అని సెటైర్లు వేస్తున్నారు జనాలు. శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ విషయంలోనూ ఇలాంటి ‘అతి’ లెక్కలే వినిపించాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక బెల్లంకొండ హ్యాండ్ గురించి కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు ‘స్పీడున్నోడు’కు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆయనదే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.