ఫోటో స్టోరి: మేకప్ రూములో అమ్మడి రచ్చే

Update: 2016-08-10 13:11 GMT
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ఇప్పుడంటే సినిమాల్లో కనిపించడం మానేసింది కానీ.. కొన్నేళ్ల క్రితం వరకూ బాగానే రచ్చ చేసేసింది. ఇప్పుడు ఒకటీ అరా మాత్రమే ఆఫర్స్ చేతిలో ఉన్నా.. అమ్మడిలో జోరు కానీ స్పీడ్ కానీ ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడెప్పుడో కహోనా ప్యార్ హైలో కనిపించినట్లే.. పవన్ పక్కన బద్రిలో ఉన్నట్లే.. 40 ఏళ్లు నిండినా ఇప్పటికీ మెరిసిపోతూ ఉంటుంది. యంగ్ ఏజ్ లో కనిపించినట్లుగానే కాదు.. చూపించినట్లుగా ఇప్పుడు కూడా ఉండగలగడం అమీషా అసలైన ప్రత్యేకత.

గత నెలలో ఎఫ్‌‌హెచ్ఎం మేగజైన్ కవర్ పేజ్ పై సందడి చేసిన అమీషా పటేల్.. చాలానే కబుర్లు చెప్పింది. ఒకవైపు మాటలతోనే లగ్జరీ కనబరుస్తూ.. మరోవైపు సోకులతో రెచ్చిపోయింది. ఇదంతా గత నెలలో జరిగినదైతే.. అప్పటి ఫోటో షూట్ కి సంబంధించి మేకప్ రూమ్ లో చేసిన రచ్చపై.. కొన్ని ఫోటోలు బిహైండ్ ద సీన్స్ అంటూ బయటకొచ్చాయి. అయినా అమ్మడు పెదాలకు లిప్ స్టిక్ అద్దుకుంటుంటే.. కుర్రాళ్ళ కొంటె చూపులు ఎటు దూసుకెళ్తున్నాయో చూడండి. అసలు తాను ఫార్టీ ప్లస్ అనే బిడియం బింకం ఏ మాత్రం కనిపించలేదులే.

గ్లామర్ డాల్స్ కి ఫోటో సెషన్ కంటే మేకప్ రూమ్ చాలా ముఖ్యం కదా. అందుకే ఇక్కడ అన్నీ ఓ సారి వేసి చూసుకుని(డ్రస్సులు-రిహార్సల్స్ అన్నమాట) అప్పుడు కెమేరా ముందు రెచ్చిపోయిందన్నమాట.
Tags:    

Similar News