ఈ మధ్య కాలంలో పదుల కొద్ది ఓటీటీల్లో వందల కొద్ది సిరీస్ లు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఎన్ని సిరీస్ లు వచ్చినా కూడా వరల్డ్ నెం.1 వెబ్ సిరీస్ ఏది అంటే స్క్విడ్ గేమ్ అనడంలో సందేహం లేదు. అత్యధిక భాషల్లో.. అత్యధికులు చూసిన సిరీస్ గా స్క్విడ్ గేమ్ చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు ఆ సూపర్ సెన్షేషనల్ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. ఆ విషయాన్ని స్వయంగా స్క్విడ్ గేమ్ దర్శకుడు డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించాడు. షూటింగ్ మొదలు కాబోతుందని... సీజన్ 1 కి ఏమాత్రం తీసి పోకుండా సీజన్ 2 ను రూపొందించబోతున్నట్లు గా దర్శకుడు పేర్కొన్నాడు.
స్క్విడ్ గేమ్ యొక్క సీక్వెల్ ను చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ షూటింగ్ ప్రారంభంకు కాస్త ఎక్కువ సమయం తీసుకుంది. స్క్విడ్ గేమ్స్ 2 గ్లిమ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ సిరీస్ పై అంచనాలు భారీగా పెంచారు. అంతే కాకుండా ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా చూసేలా చేశారు.
డబ్బు కోసం ఆశపడి ఒక దీవిలో ఎంటర్ అయ్యి అక్కడ తప్పులు చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అత్యంత డేంజరస్ గేమ్ లను అక్కడ ఆడిస్తూ ఉంటారు. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని చూస్తూ మిలియనీర్ లు ఎంటర్ టైన్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు.
ప్రతి గేమ్ కూడా బాబోయ్ అంటూ ప్రతి ఒక్కరు సీట్ చివర్లో కూర్చోబెట్టే విధంగా స్క్రీన్ ప్లే సాగుతుంది. ఇప్పుడు సీజన్ 2 కి కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు ప్రకటించడంతో అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. షూటింగ్ సగం వరకు పూర్తి అయిన తర్వాత స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెల్సిందే.