మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా వారితో వీలుకుదిరినప్పుడల్లా సమయం గడుపుతుంటారు. చిరుతో మంచి బాండింగ్ కలిగియున్న మనవరాల్లో నివృతి ఒకరు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి సంతానంగా నివృతి జన్మించింది. ఆమె ఇప్పుడు టీనేజ్ వయసులో అడుగుపెట్టింది. మెగా మనవరాలి 14వ పుట్టినరోజు వేడుకలను ఇటీవల తన తల్లి శ్రీజ సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మధ్యమాలల్లో షేర్ చేశారు.
''హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రీసియస్. నువ్వు నాకు దొరికిన గొప్పవరం. నేను నిన్ను అంతకు మించి ప్రేమిస్తున్నాను'' అని శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఈ ఫోటోలలో నివృతి తో పాటుగా శ్రీజ చిన్న కుమార్తె నవిష్క కూడా ఉంది. ఇందులో నివృతి తన తల్లి కంటే పెద్దదిగా పొడవుగా పెరగడాన్ని గమనించవచ్చు.
ఇది చూసి చిరు మనవరాలు అప్పుడే అంత పెద్ద అయిందా అని అభిమానులు మురిసిపోతున్నారు. మెగా డాటర్ తన ఇద్దరు కూతుర్లతో కనిపించడంతో.. ఒకే ఫ్రేమ్ లో బ్యూటీఫుల్ 3 అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఫోటోలో తండ్రి కూడా ఉండుంటే పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండేదని అంటున్నారు.
ఇకపోతే శ్రీజ 2016లో కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి మధ్య ఇప్పుడు అంతా సవ్యంగా లేదని.. విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ 'శ్రీజ కళ్యాణ్' నుంచి 'శ్రీజ కొణిదెల' గా మార్చడం.. తన భర్తను అన్ ఫాలో చేయడం వంటివి ఈ వార్తలకు ఊతం ఇచ్చాయి. వీరి వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు ఇరు వర్గాలు దీనిపై స్పందించలేదు. ఇక గతేడాది నివృతి పుట్టినరోజును దగ్గరుండి సెలబ్రేట్ చేసిన కళ్యాణ్.. ఈసారి మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయకపోవడం గమనార్హం.
ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ ఫోటోలలో అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు కళ్యాణ్ నటించిన సినిమాల ప్రమోషన్స్ కు మెగా హీరోలంతా దూరంగా ఉన్నారు. దీంతో శ్రీజ - కళ్యాణ్ దేవ్ వ్యవహారంలో కుటుంబ సభ్యులు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.