మాస్ రాజా రవితేజని మళ్లీ శ్రీనువైట్ల లైన్ లోకి తెస్తున్నారా? ఈ ద్వయం ఈసారి కాన్పిడెంట్ గా బరిలోకి దిగుతుందా? వెంకీ మార్క్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ఇద్దరి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'నీకోసం'..' వెంకీ దుబాయ్ శీను' చిత్రాలతో సక్సెస్ పుల్ కాంబోగా మంచి పేరుంది.
అయితే శ్రీనువైట్ల కెరీర్ ఒక్కసారిగా గాడి తప్పింది. వరుస పరాజయాలు ఊపిరాడకుండా చేస్తోన్న తరుణంలో స్నేహితుడికి మాస్ రాజా పిలిచి మరీ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా ఇచ్చారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని అందించింది.
దీంతో శ్రీనువైట్ల గ్రాప్ పూర్తిగా పడిపోయింది. అతను సినిమా చేసి నాలుగేళ్లు అవుతుంది. కథలున్నా అవకాశాలిచ్చే హీరోలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రవితేజ...స్నేహితుడు కోసం సాహసానికి సిద్దమైనట్లు వినిపిస్తుంది. ఇటీవలే రవితేజ 'ధమాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు బాగున్నాయి. లాంగ్ రన్ లో సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అంచనాలున్నాయి. 'ఖిలాడీ'..'రామారావు ఆన్ డ్యూటీ' తర్వాత రవితేజ సినిమాకి ఈ రకమైన టాక్ రావడం కొంత వరకూ గట్టెక్కినట్లే.
ఈ నేపథ్యంలో ఓ హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రవితేజ-వైట్ల ద్వయం కసిగా వర్కౌట్ చేస్తున్నారుని గుసగుస వినిపిస్తుంది. ఇటలీవలే శ్రీను వైట్లు రాజాకి కథ వినిపించారుట. అది వెంకీ తరహా ఎంటర్ టైనర్ అని సమాచారం. కథ నచ్చడంతో రావితేజ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారుట. వచ్చే ఏడాది మార్చిలో ప్రాజెక్ట్ ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారుట. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.
శ్రీనువైట్ల సక్సెస్ ఫార్ములా వినోదం. అతన్ని అగ్ర దర్శకుల సరసన స్థానం కల్పించింది తనలో ఆ ప్రతిభనే. అయితే వరుసగా అవే జోనర్ సినిమాలు చేయడంతో ఆ తరహా ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు బోర్ కొట్టింది. ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు బాగా తగ్గాయి. ఎంటర్ టైన్ మెంట్ చాలా సినిమాల్లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో జనాల సైకాలజీని స్టడీ చేస్తూ మంచి వినోదాత్మక సినిమాలు చేస్తే లైన్ లోకి రావొచ్చన్నది శ్రీనువైట్ల ప్లాన్ గా కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.