అందాల తార శ్రీదేవి ఇప్పుడు ఈ లోకంలో లేదు. కొన్ని వారాల క్రితం హఠాత్తుగా ఆమె కాలం చేసింది. ఇప్పుడు అందరూ ఆమె కూతురు తెరంగేట్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వి ఫిలిం ఎంట్రీపై ముందు నుంచే ఆసక్తి ఉన్నా.. శ్రీదేవి మరణం తర్వాత ఇది రెట్టింపైన మాట వాస్తవం.
మరాఠీ మూవీ సైరత్ ను.. బాలీవుడ్ కు అనుగుణంగా కొద్ది పాటి మార్పులతో హిందీలో ధడక్ అంటూ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అయితే.. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే.. కూతురి తొలి సినిమా రిలీజ్ కాకుండానే శ్రీదేవి మరణించింది. కానీ తొలి 25 నిమిషాల ఫుటేజ్ ను శ్రీదేవి చూసిందని చెబుతోంది జాన్వి. వోగ్ ఇండియా మేగజైన్ జూన్ ఇష్యూ కోసం మాట్లాడారు నిర్మాత కరణ్ జోహార్.. హీరోయిన్ జాన్వి. తను ఇంకా ఏఏ అంశాలలో ఇంప్రూవ్ అవ్వాలో అమ్మ చెప్పిందని అంటోంది జాన్వి కపూర్.
అయితే.. ఇలా సైరత్ ఫుటేజ్ ను చూసిన సమయంలో అమ్మ చెప్పిన తొలి.. చివరి సలహా ఒక్కటేనని చెప్పిన జాన్వి.. 'నువ్వు మొహం మీద ఏమీ ధరించలేవు.. ఈ విషయం గుర్తుంచుకో' అని చెప్పిందట శ్రీదేవి. జూలై 20న ధడక్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. శ్రీదేవి అభిమానులు అంతా ఈ చిత్రం కోసం.. ఇందులో జాన్వి కపూర్ ను చూడడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.