తనది కాని గొడవలో వేలు పెడితే... ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. శ్రీరెడ్డి ఇష్యూ నానా రచ్చ చేస్తున్న సమయంలో లేనిపోని సలహాలు ఇచ్చి... ఇరుక్కుపోయాడు ఆర్జీవీ. ఒక పక్క పవన్ అభిమానులు... మరో పక్క టాలీవుడ్ పెద్దలు వర్మని ఫుట్ బాల్ ఆడేస్తున్నారు. టాలీవుడ్ లో అలజడి సృష్టించిన వర్మపై నిషేధం వేటు వేసే దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా టాక్.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మతో సినిమా చేస్తున్న నాగార్జున పైకి కూడా ఫోకస్ పడింది. అసలు ఈ తలతిక్క వర్మతో కింగ్ నాగార్జున సినిమా ఎందుకు చేస్తున్నట్టు... అంటూ నిలదీస్తున్నారు. వర్మ- నాగ్ కాంబినేషన్లో 25 ఏళ్ల తర్వాత ‘ఆఫీసర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మే 25న విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు ఎటూ తెలియని పరిస్థితి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే చిన్న కొడుకు అఖిల్ తో ఓ సినిమా చేసేందుకు వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ్. అసలే సరైన బ్రేక్ లేక సతమతమవుతున్న అఖిల్- వర్మతో సినిమా చేయడమంటే సాహసమే అవుతుంది. ఇప్పటికే అన్న నాగచైతన్యకి ‘బెజవాడ’ లాంటి ఫ్లాపు సినిమా ఇచ్చాడు వర్మ. అలాంటి దర్శకుడిని నమ్మి అఖిల్ తో సినిమా చేయమనడం ఏంటో నాగార్జునకే తెలియాలి.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పరిస్థితులను గమనిస్తే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడడం అంత తేలికేం కాదు. ఇంతకు ముందు అనేక వివాదాల్లో చిక్కుకున్నా వాటిని పట్టించుకోకుండా తేలిగ్గా తీసిపారేసాడు వర్మ. ఇప్పుడు మాత్రం పెద్ద తప్పే చేసినట్టు ఫీల్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ఇది కూడా కపట నాటకమే కావచ్చు కానీ ఆయనతో మళ్లీ సినిమాలు చేసేందుకు ఎవ్వరూ సాహసించకపోవచ్చు. అఖిల్ సినిమా మీద వర్మ ఆశలు వదులుకుంటేనే నయమేమో!