కేటీఆర్ గారూ స్పందించండి...శ్రీ‌రెడ్డి!

Update: 2018-04-29 06:38 GMT
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోన్న శ్రీ‌రెడ్డి కొద్ది రోజులుగా సైలెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాను ఇక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సంబంధించి పోస్ట్ లు పెట్ట‌బోన‌ని...చెప్పి త‌న ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని కోట్స్ ను మాత్ర‌మే పోస్ట్ చేస్తోన్న శ్రీ‌రెడ్డి తాజాగా మ‌రో షాకింగ్ పోస్ట్ పెట్టింది. `భ‌ర‌త్ అనే నేను` సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ....త‌మ స‌మ‌స్య‌ల‌పై ఎందుకు స్పందించ‌డం లేద‌ని శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే చాలాసార్లు కేటీఆర్ గారి మొబైల్ కు చాలా మెసేజ్ లు పంపాన‌ని, అయినా స్పంద‌న రాలేద‌ని శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేటీఆర్ త‌మ స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని శ్రీ‌రెడ్డి డిమాండ్ చేస్తూ...త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ పోస్ట్ వైర‌ల్ అయింది.  

త‌మ స‌మ‌స్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ముఖ్య‌మంత్రులతోపాటు కేటీఆర్, క‌విత‌లు స్పందించాల‌ని గ‌తంలో శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె మ‌రోసారి కేటీఆర్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. శుక్ర‌వారం నాడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  - టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - విల‌క్ష‌ణ దర్శకుడు కొరటాల శివలతో క‌లిసి `విజ‌న్ ఫ‌ర్ ఎ బెట‌ర్ టుమారో` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేటీర్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. 'భరత్ అనే నేను'కు ప్రమోషన్లు చేసేందుకు స‌మ‌యం కేటాయించార‌ని - అయితే, సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై స్పందించేందుకు సమయం ఎందుకు కుద‌ర‌డం లేద‌ని కేటీఆర్ ను శ్రీరెడ్డి ప్రశ్నించింది.

కొద్ది నెలలుగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ పై తాము పోరాడుతున్నామని, ద‌య‌చేసి తమకు న్యాయం చేయాల‌ని కేటీఆర్ ను కోరింది. ఇండ‌స్ట్రీలోని పెద్ద కుటుంబాలు....తమ సమస్యలపై సరైన విధంగా స్పందించడం లేదని, వారు తీసుకున్న నిర్ణయాలు త‌మ‌కు అసంతృప్తినిచ్చాయ‌ని చెప్పింది. తెలుగు మహిళలు - యువతులకు సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం లేద‌ని వాపోయింది. కేటీఆర్ ను కలవాలనుకుంటున్నామని, త‌మ‌కు అపాయింట్ మెంట్ ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేసింది. కేటీఆర్‌ పీఏ మొబైల్ కి కూడా చాలాసార్లు మెస్సేజ్‌ లు చేశానని, అయినా ఆయ‌న స్పందించ‌లేద‌ని చెప్పింది. తమ సమస్యలకు పరిష్క‌రించ‌గ‌ల‌రో లేదో చెప్పాల‌ని కేటీఆర్ ను సూటిగా ప్ర‌శ్నించింది.
Tags:    

Similar News