ఏదైనా మొదలు పెట్టటం ఈజీనే. మొదలు పెట్టేటప్పుడు ఉండే ఉత్సాహం.. ప్లానింగ్.. అంతా తర్వాతి దశల్లో కనుమరుగైపోతాయి. ఈ విషయాన్ని గుర్తించి మొదలు పెట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారో.. అంతే జాగ్రత్తగా తర్వాతి దశల్లో కొనసాగితే మంచిది. లేనిపక్షంలో తిప్పలు తప్పవు. ఈ విషయం సినీ నటి శ్రీరెడ్డి విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
నిన్న మొన్నటివరకూ ఛానళ్ల చర్చల్లో చెలరేగిపోయి మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు నీరసనంగా కనిపిస్తోంది. మొన్నటి వరకూ ఆమెకు మద్దతుగా నిలిచిన వారు ఇప్పుడు ఆమెకు ఎదురుగా నిలుస్తున్నారు. తన మాటలోనూ.. చేతల్లోనే కాదు.. గెటప్ విషయంలోనూ శ్రీరెడ్డి డబుల్ స్టాండ్ ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఆమె ఫేస్ బుక్ అకౌంట్ చూస్తే .. ఆమె ఎలాంటి అంశాల్ని పోస్ట్ చేసేదో ఇట్టే తెలుస్తుంది. అలాంటి ఆమె ఇప్పుడు నోరు తెరిస్తే.. అన్నా అనటం.. చీరకట్టుతో చర్చల్లో కూర్చోవటం లాంటివి చూసినప్పుడు.. సడన్ గా ఇంత మార్పు ఎందుకు? అన్న డౌట్ రావటం ఖాయం.
అదే సమయంలో శ్రీరెడ్డిని మొదట్నించి నెత్తిన పెట్టుకున్నట్లుగా వ్యవహరించిన టీవీ ఛానళ్లలో కొన్ని ఆమెను కనుమరుగు చేస్తే.. మరికొన్ని ఛానళ్లు కంటిన్యూ చేస్తున్నాయి. ఎందుకలా? అంటే.. టీవీ స్టూడియో నుంచి బయటకు వెళ్లి మీటింగ్ లు పెట్టటం మొదలైన నాటి నుంచి శ్రీరెడ్డి మీద ఉన్న ఆసక్తి ఛానళ్లకు నెమ్మదిగా తగ్గుతున్నాయన్న మాట వినిపిస్తోంది.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఒక సంచలన అంశాన్ని తెర మీదకు తేవటంలో శ్రీరెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ అంశంపై చర్చకు ఎవరూ ముందుకు రాని టైంలో శ్రీరెడ్డి ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందన్న మాటను చెప్పినప్పుడు ఆమెకు సపోర్ట్ గా నిలిచినోళ్లు చాలామందే ఉన్నారు. తనను చాలామంది వాడుకున్నారంటూ ఆమె ఆరోపిస్తూ.. నవ్వుతూ.. తుళ్లుతూ దిగిన సెల్ఫీల్ని రిలీజ్ చేసినా సర్లే.. అని సర్ది చెప్పుకున్నారు.
కానీ.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండంటూ ఇచ్చిన సలహాను తిట్టేయటం.. రాయలేని పదజాలంతో విరుచుకుపడటం అందరిని షాక్ కు గురి చేసింది. ఒక సలహా.. అది కూడా ఎవరూ తప్పు అని చెప్పలేని పవన్ సలహా విషయంలో శ్రీరెడ్డి రియాక్షన్.. ఆయన మీద మాట తూలటం ఆమె చేసుకున్న స్వయంకృతాపరాధంగా చెప్పక తప్పదు. తానేం చెప్పినా జనాలు నమ్మేస్తున్నారన్న భ్రమో.. శృతిమించిన ఆత్మవిశ్వాసమో.. తన వెనుక కొత్తగా చేరిన బలంతో వచ్చిన మాటలో కానీ.. ఆమె మాటల్ని ఇప్పుడు ఖండించే వారు ఎక్కువ అయ్యారు.
తనకు అన్యాయం జరిగిందని చెబుతూనే.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా పలువురి మీద ఎక్కు పెట్టిన ఆరోపణలు సైతం శ్రీరెడ్డిని వేలెత్తి చూపేలా చేస్తున్నాయి.
మా సంస్థ ఆమెను ఏకపక్షంగా బ్యాన్ చేసిన సమయంలో.. మా వారి పెత్తందారి పోకడలు సరికావంటూ ఎవరైతే గొంతు విప్పారో.. అలాంటోళ్లు సైతం ఇప్పుడు శ్రీరెడ్డి ఎదురుగా నిలుస్తున్నారు. శ్రీరెడ్డి మీద బ్యాన్ విధించిన వైనంపై చర్చల మీద చర్చలు పెట్టి టీఆర్పీలు భారీగా రాబట్టుకున్న ఛానళ్లు.. ఇప్పుడు శ్రీరెడ్డి తీరుపైన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో టీవీ స్టూడియోలకు పరిమితమైన శ్రీరెడ్డి.. ఇప్పుడు ప్రెస్ మీట్ల పేరుతో బయటకు రావటంతో కొన్ని టీవీ ఛానళ్లు ఆమె విషయంలో ఆసక్తిని ప్రదర్శించటం లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. తాము కోరుకున్న ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందరికి వెళ్లిపోవటం ఛానళ్లకు నచ్చటం లేదు. అందుకే.. శ్రీరెడ్డిని ప్రయారిటీ కింద లెక్కకు తీసుకోకుండా మరో అంశంపై దృష్టి పెడితే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇదంతా చూసినప్పుడు.. తాను మొదలు పెట్టిన పోరాటానికి అందరూ తన గొంతుకైనట్లుగా రియాక్ట్ అవుతున్న వేళ.. పవన్ పై ఆమె చేసిన వ్యాఖ్య ఆమె ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. ఆమెను ప్రశ్నిస్తున్నాయి. వారు వేస్తున్న ప్రశ్నలకు శ్రీరెడ్డి నుంచి సరైన సమాధానాలు రాని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు నోరు జారిన శ్రీరెడ్డి అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులో పడ్డారని చెప్పక తప్పదు.