రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘పవర్ స్టార్’ మూవీకి కౌంటర్ గా నూతన్ నాయుడు ‘పరాన్నజీవి’ అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన నూతన్ నాయుడు తనకు పవన్ పై ఉన్న అభిమానంను ఈ చిత్రంతో చూపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ పై వర్మ వరుసగా చేస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే విధంగా పరాన్నజీవిని తెరకెక్కిస్తున్నారు. గతంలో పవన్ ను బ్లేమ్ చేసేందుకు ఎలాంటి కుట్ర చేశాడు పబ్లిసిటీ కోసం వర్మ ఏం చేస్తాడు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట.
ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీరెడ్డిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వర్మ సూచన మేరకు పవన్ ను శ్రీరెడ్డి విమర్శించింది. ఆ విషయాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వర్మ గురించి తీస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక శ్రీరెడ్డి ఇందులో నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని నూతన్ నాయుడు అండ్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వర్మ పవర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేసే రోజునే అంటే జులై 25న ఈ సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. వర్మ ఇటీవల శ్రేయాస్ ఈటీ ద్వారా తన సినిమాలను విడుదల చేశారు. కాని వర్మ తీసిన ఈ వివాదాస్పద సినిమాను శ్రేయాస్ ఈటీ విడుదలకు ఒప్పుకోక పోవడంతో సొంతంగానే వర్మ విడుదలకు సిద్దం అయ్యాడు.
వర్మ పై తీస్తున్న పరాన్నజీవి చిత్రం మాత్రం శ్రేయాస్ ఈటీ ఎనీటైమ్ థియేటర్ లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని భవనంలో చేస్తున్నారు. సినిమా పూర్తిగా అక్కడే ఉంటుందట. ఇప్పటి వరకు వర్మ గురించి పలు సినిమాల్లో చూపించారు. అయితే ఈసారి నూతన్ నాయుడు చేస్తున్న సినిమా మాత్రం సెన్సార్ పరిమితులు లేవు కనుక ఏ స్థాయిలో చూపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.