బాలయ్య కొడతాడు.. మెగా ఫ్యామిలీ లాగా కాదు: శ్రీరెడ్డి

Update: 2020-06-10 10:50 GMT
ఈరోజు టాలీవుడ్ అగ్రహీరో బాలక్రిష్ణ పుట్టినరోజు. సోషల్ మీడియాలో, మీడియాలో అంతటా బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులంతా బాలయ్య షష్టిపూర్తికి విషెస్ తెలుపుతున్నారు.

ఇక ఎప్పుడూ వివాదాలతో కాలం గడిపే నటి శ్రీరెడ్డి తాజాగా బాలక్రిష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ కామెంట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం విశేషం.

బాలక్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా శ్రీరెడ్డి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘ఇండస్ట్రీ సింహస్వప్న, నటరత్న, తెలుగు ప్రియ.. మంచి మానవత్వం ఉన్న సోషల్ సర్వీస్.. ఆయనకు పద్మశ్రీ అవసరం లేదు.. ఆయన నవ్వే ఒక పెద్ద అవార్డ్. లివింగ్ లెజెండ్ బాలక్రిష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాలయ్య వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇక ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీపైనా ఆడిపోసుకుంది శ్రీరెడ్డి.. ‘ప్రేమతో చెంప మీద కొడతావ్ తప్ప.. మెగా ఫ్యామిలీలాగా కడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ.. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం గురించి ఆలోచించే ముద్దుల మావయ్య.. మా బాలయ్య అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News