కాళీ మాత అవతారం ఎత్తి నీ అంతు చూస్తా విశాల్

Update: 2019-06-16 07:26 GMT
శ్రీరెడ్డి అనే పేరు వినగానే ఎంతో హంగామా.. రచ్చ.. పాతకాలంలో మునిసిపల్ టాప్స్ దగ్గర జరిగే బూతుల యుద్దాలు అన్నీ గుర్తొస్తాయి.  మొదట్లో శ్రీరెడ్డిని అన్ కండిషనల్ గా సపోర్ట్ చేసిన చాలామంది కాలం గడిచేకొద్ది ఈ గోల మనకెందుకు అని దూరంగా.. న్యూట్రల్ గా ఉండిపోయారు.  అయితే ఇప్పటికీ శ్రీరెడ్డి ని ఫాలో అయ్యేవారు కొందరు ఉన్నారు.  రీసెంట్ గా శ్రీరెడ్డి కోలీవుడ్ హీరో విశాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చాలా పోస్టులలో ఇక్కడ రాయలేని భాషలో విరుచుకుపడింది. కానీ ఆ బండ బూతులు వదిలిపెట్టి ఇక్కడ రాయగలిగినవే చర్చిస్తున్నాం. హీరోయిన్ తో కమిట్ మెంట్ తీసుకోకుండా విశాల్ అసలు సినిమానే చెయ్యడని ఆరోపించింది. ఇక విశాల్ క్యారవాన్ లో ఏం జరుగుతుందో తెలుసా అని ప్రశ్నిస్తూ..  విశాల్ క్యారవాన్ కు అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తి  తనకు తెలుసని వెల్లడించింది.  విశాల్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని.. విశాల్ వల్ల నాశనమైన ముగ్గురు బాధితులు తనకు తెలుసని చెప్పింది.  "నా జోలికి వస్తే కాళీమాత అవతారం ఎత్తి నీ అంతు చూస్తాను" అంటూ విశాల్ ను  బెదిరించింది.  

విశాల్ కు నడిగర్ సంగం ఎలెక్షన్స్ లో ఒక్కరు కూడా ఓటు వేయవద్దని.. పైకి కనిపించే విశాల్ వేరు.. ఆయన అసలు స్వరూపం వేరని.. ఆ విషయం అర్థం చేసుకోవాలని కోలీవుడ్ వారికి సందేశం ఇచ్చింది.  శ్రీరెడ్డి చేస్తున్న రచ్చపై ఇంకా విశాల్ స్పందించలేదు.    


Tags:    

Similar News