సంచలనాత్మక వ్యాఖ్యలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లాక్ డౌన్ సమయంలో జీవితానికి సంబంధించిన కొన్ని మంచి మాటలు చెప్పింది. మహిళలు ఎలా ఉండాలో.. ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే పురుషుడు శాంతిగా ఉంటాడో తన అభిప్రాయలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అసలే లాక్ డౌన్ కావడంతో ఈ కామెంట్లు భలేగా వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి అమ్మాయి జీవితంలోకి వస్తే మగవారు సుఖపడతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరొచ్చినా సుఖం ఉండదు అనేది చేదుగా ఉండే వేదాంతం. అయితే లాక్ డౌన్ లో వేదాంతం చెప్పి శ్రీరెడ్డి జనాలను బెదరగొట్టదు కాబట్టి సింపుల్ గా నాలుగు ముక్కల్లో వారి గురించి చెప్పింది. "ఏదైనా సాధించిన.. స్వతంత్రంగా నడుచుకునే.. ఆత్మగౌరవం కలిగిన అమ్మాయిల వల్ల అబ్బాయిలు సుఖంగా ఉంటారు" అంటూ కెవ్వు కేక టిప్ ఇచ్చింది. ఇక ఎవరిని చేసుకుంటే అబ్బాయిల బతుకు బస్టాండ్ అవుతుందో కూడా టూకీగా చెప్పేసింది.. "ప్రతిరోజూ ఏదో విషయంలో ఎమోషనల్‌గా హత్యాచారం చేసే సీరియల్ యాక్టర్స్ లాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదు" అంటూ క్లారిటీ ఇచ్చింది. సీరియల్ లో కనిపించే 'యాంటీ హీరోయిన్' పాత్రల తరహా అని అర్థమేమో.. పొరపాటున "సీరియల్ యాక్టర్స్ ను పెళ్లిచేసుకోవద్దు" అని కొత్త పలుకు పలకకండి!
అంతే కాదు. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకునేవారు. పద్ధతిగా కనిపించేవారు.. నాన్నకూచి అని చెప్పుకునే బ్యాచ్ అంతా మంచివారని మీరు అనుకుంటే అదో మంచి జోక్ అని సాఫ్ట్ గా హెచ్చరించింది. అంతే కాదు.. పబ్ కు వెళ్ళే అమ్మాయిలంతా చెడ్డవారు కాదని.. ఎవరైనా వారిని బాధపెడితే మరిచిపోయేందుకు అమ్మాయిలు పబ్ కు వెళ్తారని గమనించాలని చెప్పింది. ఇక తన ఘాటు స్టైల్లో "*** ద్వారా క్యారెక్టర్ నిర్ణయించవద్దు.. మంచి మనసు అమ్మాయిల క్యారెక్టర్‌ను తెలుపుతుంది" అని శెలవిచ్చింది.
లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలు కొనితెచ్చుకోవద్దని కూడా హితబోధ చేసింది. ఈమధ్య వివాహం చేసుకున్న ఆడవారిని శ్రీరెడ్డి గమనిస్తోందట.. అయితే వారిలో చాలామంది అసలు పద్దతిగా ఉండడం లేదని.. ఇలాంటి వారి వల్ల సమాజానికి శాంతి చేకూరదని.. వీరు బాధ్యతాయుతమైన పౌరులను కూడా అందించలేరని తేల్చిపారేసింది.