శ్రీదేవి అస్థికలు అక్కడ కలిపేశారు

Update: 2018-03-05 06:03 GMT
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బ్యూటీ శ్రీదేవి కపూర్ మరణించి రోజులు గడుస్తున్నా ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతునే ఉంది. ఎవ్వరైనా మరణించక తప్పదు అనే సత్యాన్ని అప్పుడపుడు మనుషులకు ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం దుబాయ్ లో శ్రీదేవి మరణం గత ఆదివారం ఉదయం భారతీయులకు ఒక మర్చిపోలేని చేదు అనుభవం.

ఇకపోతే రీసెంట్ గా శ్రీదేవి మరణం అనంతరం చివరి కార్యక్రమం ముగిసింది. కుటుంబ ఆచారాల ప్రకారం మార్చ్ 3వ తేదీన ఆమె అస్థికలను రామేశ్వరంలో కలిపారు. బోణి కపూర్ తో పాటు శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి - ఖుషి కూడా చివరి తంతులో తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముగ్గురు తెల్లని దుస్తుల్లో శ్రీదేవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో బోనీ కపూర్ కాస్త కోలుకున్నట్లే కనిపించినా.. జాహ్నవి అండ్ ఖుషీ మాత్రం బాగా కుంగిపోయారని వారిని చూస్తేనే అర్దమవుతోంది.

ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా రీసెంట్ గా శ్రీదేవి ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని శ్రీదేవి కూతుళ్లు కూడా ఆమె కోరుకున్నట్లుగా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆశీర్వదించారు.      


Tags:    

Similar News