ఆ మధ్య బెంగళూరులో ఒక ఫ్యాషన్ షోలో శ్రీదేవి లుక్ చూసి షాకైపోయారంతా. నిజంగా ఈమె 50 ప్లస్ లేడీయేనా అని ఆశ్చర్యపోయేలా రెడ్ డ్రెస్సులో అదరగొట్టింది అతిలోక సుందరి. ఇక ఇటీవలే ముంబయిలో జరిగిన ఫిలిం ఫేర్ గ్లామర్ అవార్డుల వేడుకలో యంగ్ హీరోయిన్లకు దీటుగా సెక్సీ డ్రెస్సులో శ్రీదేవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. గ్లామర్ విషయంలో.. కాస్ట్యూమ్స్ విషయంలో శ్రీదేవికి ఈ వయసులోనూ ఇంత శ్రద్ధ ఉందేమిటబ్బా అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న తరుణంలో ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చింది ఈ మాజీ హీరోయిన్.
ముకేష్ అంబానీ ముంబయిలో ఏర్పాటు చేసిన ఒక వేడుకకు శ్రీదేవి తయారై వచ్చిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. టాప్ టు బాటమ్ జీన్స్ డ్రెస్సులో నిండుగా తయారై వచ్చిందామె. ఆ డ్రెస్ చాలా సాదాసీదాగా.. పేలవంగా ఉండేసరికి సడెన్ గా శ్రీదేవికి ఏమైంది.. ఆమె టేస్టు ఇలా పడిపోయిందేంటి అని జనాలు చర్చించుకున్నారు. డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడు చాలా కాన్షియస్ గా ఉండే శ్రీదేవి.. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఎలా ఓకే చేసిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. సోషల్ మీడియాలో ఈ డ్రెస్ విషయమై నిన్నట్నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్ శ్రీదేవి వరకు వెళ్తే జీవితంలో మళ్లీ ఇలాంటి డ్రెస్ వేయదేమో.