అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఇప్పటి వరకూ నటించింది ఒకే సినిమా. మరాఠి ఫిలిం 'సైరాట్' కు రీమేక్ గా తెరకెక్కిన 'ధడక్' ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విమర్శకులను ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ అనిపించుకుంది. ఇక జాన్వికి నటిగా యావరేజ్ మార్కులే పడ్డాయి. అయితే జాన్వికి ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే.
మరీ ముఖ్యంగా జాన్వి రోజూ జిమ్ కు పోవడం.. రావడం అనేది ఒక పెద్ద మిషన్ మంగళయాన్ లాంటిది. అందరూ జిమ్ముకు ఏదో ఒక స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. కానీ జాన్వి ఒకరోజు వేసుకున్న జిమ్ము డ్రెస్ ఇంకోరోజు వేసుకోదు. సరే ఆ డ్రెస్ అయినా ఏదో ఒకటిలే.. అనే రకంగా ఉండదు. డిజైనర్ వేర్ తరహాలో ప్రతి డ్రెస్సు సూపరే. సోషల్ మీడియా ఈ స్పీడును తట్టుకోలేక కెవ్వుకెవ్వున కేకలు పెడుతూ ఉంటుంది. జిమ్ము డ్రెస్సులతో కూడా బాలీవుడ్ లో ప్రత్యేక హోదా సాధించవచ్చు అని నిరూపించిన మొదటి హాటీ జాన్వి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ చిట్టిపొట్టి నిక్కర్లు.. శరీరాన్ని ప్రేమగా ఫెవికాల్ లా అతుక్కుపోయిన టీ షర్టుల గురించి రాస్తూపోతే ఒక్కొక్కరు ఒక్కో కాళిదాసు కావడం ఖాయం. అలా రోజూ జాన్వి జిమ్ము డ్రెస్సుల ఫోటోలు చూస్తూ ఉంటే దేవదాసుగా మారడం కూడా ఖాయమే. ఇదంతా బాగానే ఉంది కానీ జాన్విని విమర్శించేవారు కూడా తక్కువేమీ లేరు. జిమ్ము డ్రెస్సుల మీద పెట్టే శ్రద్ధలో పదోవంతు నటనపై పెడితే శ్రీదేవి పేరు నిలబెట్టొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో జిమ్ స్పాట్ లకే పరిమితమైన పెద్ద హీరోయిన్ కూతురు అంటూ సెటైర్లు వేస్తున్నారు.