వరుణ్‌ కంటే మహేష్‌ బెటరేమో??

Update: 2016-10-04 22:30 GMT
అందాల తార శ్రీదేవి సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలేసింది. రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చి సోలోగా సక్సెస్ సాధించి తన పవర్ ని ఈ జనరేషన్ కి చూపించింది కూడా. అయితే.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినీ అరంగేట్రంపై గత కొన్నేళ్లుగా బోలెడన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఒక బాలీవుడ్ సినిమా సైన్ చేసినట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు జంటగా.. జాన్వి తొలి సినిమా చేయనుందని వార్తలొస్తున్నాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే కరణ్ జోహార్ నిర్మాణంలోనే ఈమె లాంఛింగ్ ఉండనుండగా.. 'టు స్టేట్స్' వంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అభిషేక్ వర్మన్ తెరకెక్కించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమాను సైన్ చేసిన జాన్వి.. మరి మహేష్‌ బాబు అండ్ ఏ.ఆర్.మురుగుదాస్ సినిమా ఎందుకు సైన్ చేయలేదు అని ఎవరైనా ఆరా తీయక మానరు. వరుణ్‌ దావన్ తో డెబ్యూ చేసేకంటే.. చక్కగా సౌత్ లో మహేష్‌ తో ఒక సినిమా.. మరో ఇద్దరు టాప్ స్టార్లతో ఓ రెండు సినిమాలు చేసి కాస్త అనుభవం పెంచుకుని బాలీవుడ్ కు వెళ్లుంటే.. శ్రీదేవి తరహాలో భారీ రేంజుకు వెళ్ళే ఛాన్సుండేది.

ఇప్పుడు డైరెక్టుగా కథానాయికగా బాలీవుడ్ లో డెబ్యూ అయిపోతే.. అయితే స్టార్ అవ్వొచ్చు. లేదంటే మాత్రం అతియా శెట్టి.. సోనమ్ కపూర్.. అక్షర హాసన్.. సాషా అగా.. తరహాలో ఫెయిల్ అయ్యే ఛాన్సు కూడా ఉంది. ఆ లెక్కన చూస్తే.. వరుణ్‌ కంటే ముందు మహేష్‌ తో చేస్తే పరిస్థితి కాస్త బెటర్ గా ఉంటుందేమో అనే వాదనకు బలం చేకూరుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News