సినీతార అనే మాటకు అసలు రుపంలాంటి శ్రీదేవి ఇక లేరు అనే మాట నిజంగా అబద్దం అయితే బావుండు అని అనుకునే వారు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ఆదివారం ఉదయం మొబైల్ పట్టుకోగానే శ్రీదేవి RIP అనే స్టేటస్ లు ఒక్కసారిగా కళ్లకు తెలియని భావోద్వేగ తడిని గుర్తు చేశాయి. ప్రతి ఒక్కరి గుండె ఒక్క క్షణం ఆమె నవ్వును అందాన్ని గుర్తు చేసి శ్రీదేవి చనిపోవడం ఏంటి అనే ప్రశ్న మనసులో మెదిలేలా చేసింది.
అయిదు పదుల వయసున్నా కూడా ఇంకా ఆమె అభిమానులు ఆరాధించడం మానలేదు. ఇకపోతే శ్రీదేవి ఆకరికోరిక ఒకటి తన కుటుంబ సభ్యులతో అలాగే సన్నిహితులతో చెప్పుకునేదట. నేను చనిపోయినప్పుడు నా అంతిమ యాత్రకు సంబంధించి మొత్తం తెలుపు రంగులో ఉండాలని చెప్పిందట. శ్రీదేవికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ యాత్రను శ్రీదేవి కోరిక ప్రకారమే నిర్వహించనున్నారట.
ఆమెకోసం స్పెషల్ గా ఒక వాహనాన్ని కూడా తెలుపు రంగులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తెల్ల పూలతో దారి ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే బోణి కపూర్ కుటుంబ సభ్యులు అందుకు తగ్గ ఏర్పాట్లు మొత్తంగా పూర్తి చేశారని సమాచారం. రేపు ఆమె పార్థివదేహాన్ని ముంబైలో ఆమె నివాసం వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ముంబైకి చేరుకున్నారు. సౌత్ నుండి ముందుగా రజినీకాంత్ - వెంకటేష్ ముంబై వెళ్లారు.