సూపర్‌ స్టార్‌ కోసం ఉపవాసం చేసిన శ్రీదేవి

Update: 2020-08-16 07:50 GMT
ఇటీవల అతిలోక సుందరి శ్రీదేవి జయంతి జరిగింది. ఆమె చనిపోయి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఆమె జ్ఞాపకాల్లో అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఉన్నారు. ఆమె జయంతి సందర్బంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను గుర్తు చేసుకుని ఫ్యాన్స్‌ ఫొటోలు మరియు వీడియోలు షేర్‌ చేశారు. ఈ సమయంలో శ్రీదేవి  గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సూపర్‌ స్టార్‌ అనారోగ్యంతో ఉన్న సమయంలో శ్రీదేవి పడ్డ ఆందోళన గురించి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

2011 సంవత్సరంలో రజినీకాంత్‌ తీవ్ర అనారోగ్యం పాలయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆయన విదేశాలకు వెళ్లి మరీ చికిత్స పొందారు. అనేక పుకార్లు షికార్లు చేశాయి. రోబో తర్వాత రజినీకాంత్‌ మళ్లీ సినిమా చేయక పోవచ్చు అంటూ చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. కాని అనూహ్యంగా రజినీకాంత్‌ మళ్లీ కోలుకున్నారు. కాస్త గ్యాప్‌ తీసుకున్న రజినీకాంత్‌ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.

రజినీకాంత్‌ ఆరోగ్యం బాగా లేని సమయంలో శ్రీదేవి వారం రోజుల పాటు ఉపవాస దీక్ష చేశారట. ఆయన కోలుకుని మళ్లీ ఆరోగ్యంతో రావాలని శ్రీదేవి ప్రార్థనలు చేశారు. తన తోటి నటుడి కోసం ఉపవాస దీక్ష చేయడం అంటే మామూలు విషయం తెల్సిందే. శ్రీదేవి మంచి మనసుకు ఇది నిదర్శణం అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News