బాహుబలి 2 కి సన్నాహాలు సాగుతున్నాయి. ఈసారి జక్కన్న బుర్ర మెరుపు వేగంతో పనిచేస్తోంది. మునుపటి కంటే షార్ప్ గా వర్కవుట్ చేస్తోంది. కేవలం లోకల్ హీరోలతోనే 600కోట్లు కొల్లగొట్టేశాం. ఇప్పుడు నేషనల్ లెవల్ స్టార్లను రంగంలోకి దించితే ఇక మార్కెట్ రేంజు ఏ స్థాయికి చేరిపోతుందో అన్న కుతూహాలం కనబరుస్తున్నాడు.
నిజానికి 1000 కోట్లు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. అందుకే ఈసారి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి దిగ్గజాల్లాంటి నటీనటుల్ని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నాడు. అట్నుంచి నటీనటులు ఒకే అయితే దానికి తగ్గట్టే స్ర్కిప్టులో మార్పు చేర్పులు ఉంటాయి. సినిమాలో కీలక పాత్రల పరిధిని విస్తరించి తనకి వీలుచిక్కినంతా మార్కెట్ ను కొల్లగొట్టాలన్నది మాష్టర్ ప్లాన్. ఎలాగూ తెలుగు దర్శకుడు కాబట్టి తెలుగులో ఈజీగానే ఎక్కేస్తుంది. ఇక ఆకట్టుకోవాల్సింది బాలీవుడ్, కోలీవుడ్ లనే. కాబట్టి ఈ మూడు భాషల్లో తెలిసిన నటి శ్రీదేవిని ఓ కీలకపాత్రకు ఎంచుకోవాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇప్పటికే అతిలోక సుందరి పులి ట్రైలర్ లో అదిరిపోయే లుక్‌తో ఆకట్టుకుంది. ఆ సినిమాతో మరింతగా శ్రీదేవి పాపులారిటీ పెరుగుతుంది. అలాంటప్పుడు తనని బాహుబలి 2 కోసం ఎంపిక చేసుకుంటే అది సినిమాకి ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్లాయి.
అయితే జక్కన్నను కాదని, బాహుబలి: ది బిగినింగ్ లో నటించనని చెప్పిన శ్రీదేవిని అన్నీ మరిచి తిరిగి ఎలా సీక్వెల్ లోకి తీసుకుంటారన్న విమర్శలొస్తున్నాయి. తనని తిరస్కరించినా తిరిగి శ్రీదేవి వెంటే పడడానికి మార్కెట్ ఒక్కటే కారణమా? అని ప్రశ్నిస్తున్నారు. శివగామి పాత్రలో శ్రీదేవి కంటే రమ్యకృష్ణ వంద శాతం న్యాయం చేయగలిగిందని అంటున్నారు. దీనికి జక్కన్న ఏం సమాధానం చెబుతాడో?