శ్రీ‌దేవి డెషిస‌న్ తప్పు కాదులేండి

Update: 2015-10-09 22:30 GMT
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న కెరీర్‌లోనే రేర్ ఎటెంప్ట్స్ చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో సౌత్ సినిమాల్లో వ‌చ్చే అవ‌కాశాల్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి ఓకే చేస్తోంది. అలా ఓకే చెప్పిన క్యారెక్ట‌ర్ య‌వ్వ‌న రాణి. విజ‌య్ హీరోగా చింబుదేవ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పులి చిత్రంలోని క్యారెక్ట‌ర్ ఇది. అయితే ఈ క్యారెక్ట‌ర్‌ లో శ్రీ‌దేవి స‌రిగా న‌టించ‌లేదు అన్న విమ‌ర్శ‌లొచ్చాయి. పులి అట్ట‌ర్‌ ఫ్లాప్ అవ్వ‌డం ఈ క్యారెక్ట‌ర్‌ కి కూడా నెగెటివ్ అయ్యింద‌ని విశ్లేషిస్తున్నారు.

స‌రిగ్గా ఇదే టైమ్ అని విమ‌ర్శ‌కులు శ్రీ‌దేవి నిర్ణ‌యంపై చెల‌రేగిపోతున్నారు. బాహుబ‌లిలో శివ‌గామి క్యారెక్ట‌ర్‌ ని కాద‌నుకుని పులి లో య‌వ్వ‌న రాణి క్యారెక్ట‌ర్‌ ని ఎంపిక చేసుకుంది. త‌గిన శాస్తి జ‌రిగింది అని ఎగిరి గంతేస్తున్న‌వాళ్లు ఉన్నారు. అయితే వీళ్లంద‌రికీ తెలియాల్సింది ఏమంటే.. ఓ హిట్టు సినిమాకి ఉన్న ప‌వ‌ర్‌ - ఓ చెత్త సినిమాకి లేని ప‌వ‌ర్ అర్థం చేసుకోవాలి.

నిజం చెప్పాలంటే.. శ్రీ‌దేవి ఎంపిక చేసుకున్న య‌వ్వ‌న‌రాణి క్యారెక్ట‌ర్‌ లో బోలెడంత పెర్ఫామెన్స్‌ కి అవ‌కాశం ఉంది. ఓ సినిమా ఫ‌లితాన్ని శాసించే విల‌నీ త‌న‌కి ద‌క్కింది. ఆ క్యారెక్ట‌ర్‌ లో బోలెడంత ఎమోష‌న్‌ - క్రూర‌త్వం ఎలివేట్ అవ్వ‌డానికి ఛాన్సుంది. అదే బాహుబ‌లిలో శివ‌గామి క్యారెక్ట‌ర్‌ లో అన్ని ఎమోష‌న్స్ లేవు. రాయ‌ల్ లుక్‌ తో రాణీగా క‌నిపించ‌డానికి కేవ‌లం శ‌త్రువుపై కోపం ప్ర‌ద‌ర్శించ‌డానికే ఆ పాత్ర‌కు స్కోప్ ఉంది. య‌వ్వ‌న‌రాణిలో ఉన్న‌న్ని డైమ‌న్ష‌న్స్ లేవు. య‌వ్వ‌న‌రాణి క్యారెక్ట‌ర్‌ ని ఎంచుకోవ‌డం త‌ప్పేమీ కాదు.

అయితే ఓ క్యారెక్ట‌ర్‌ ని ఎలివేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ చాలా అవ‌స‌రం. ఆ విష‌యంలో రాజ‌మౌళి స‌క్సెస్ అయినంత‌గా, చింబుదేవ‌న్ స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయాడు. అదే శ్రీ‌దేవికి ప్రాబ్లెమ్ అయ్యింది.. శివగామికి ప్లస్‌ అయ్యి రమ్యకృష్ణ కు పేరు తెచ్చిపెట్టింది.
Tags:    

Similar News