అసలే ‘బాహుబలి’ సినిమాలో శివగామి క్యారెక్టర్ మిస్సయ్యానన్న బాధ. దీనికి తోడు ‘పులి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో బాధ డబుల్ అయ్యింది. ఆ సినిమాలో తన నిడివి తగ్గించేయడం మీద కూడా పట్టరాని కోపం వచ్చింది అప్పట్లో శ్రీదేవికి. ఇవన్నీ కాకుండా ‘పులి’ సినిమా శ్రీదేవికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ‘పులి’లో రాణి పాత్ర కోసం తనకు ఇస్తానన్న పారితోషకంలో రూ.50 లక్షల బ్యాలెన్స్ చెల్లించలేదంటూ ఆ సినిమా నిర్మాతలపై శ్రీదేవి ఫిర్యాదు చేసిందన్న వార్త షాకిస్తోంది.
ఈ సినిమాకు శ్రీదేవి కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం శ్రీదేవి రెండు కోట్లు తీసుకోవడం పెద్ద విషయం కాదని అనుకున్నారంతా. ఐతే రెమ్యూనరేషన్ లో ఓ 50 లక్షలు విడుదల తర్వాత చెల్లిస్తామని నిర్మాతలు చెప్పగా.. శ్రీదేవి ఓకే చెప్పింది. ఐతే సినిమా దారుణమైన ఫలితాన్ని చూడటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. దీంతో శ్రీదేవికి బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఐతే శ్రీదేవి మాత్రం కరుణించలేదు. ఆ యాభై లక్షలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టింది. నిర్మాతలు చేతులెత్తేయడంతో నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. మరి ఈ గొడవ ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.