శ్రీకాంత్ అడ్డాల ఏమయ్యాడండీ!?

Update: 2018-05-10 01:30 GMT
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. కొన్నేళ్ల క్రితం సెన్సేషన్. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. మల్టీస్టారర్ మూవీకి ఇద్దరు స్టార్ హీరోలను ఒప్పించడమే కాకుండా.. జనాలను మెప్పించగలిగాడు కూడా. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్-మహేష్ లను అన్నదమ్ములుగా చూపి హిట్టు కొట్టాడు.

అయితే.. ఆ తర్వాత మాత్రం ఈ దర్శకుడికి కాలం కలిసిరాలేదు. బ్రహ్మోత్సవం అంటూ మహేష్ బాబుతో రూపొందించిన మూవీ.. అటు మహేష్ బాబుకు షాక్ ఇవ్వడమే కాదు.. ఈ దర్శకుడికి పూర్తిగా కెరియర్ ని నాశనం చేసేసింది. కొత్త ట్రెండ్ సృష్టించి.. అనేక మందికి దారి చూపించినా.. బ్రహ్మోత్సవం తర్వాత ఒక్క సినిమా కూడా చేసే అవకాశం కూడా అందలేదంటే.. శ్రీకాంత్ అడ్డాల అంటే నిర్మాతలు ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతుంది. నిజానికి బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత.. శ్రీకాంత్ అడ్డాలకు ఓ సినిమా ఛాన్స్ ఉంటుందంటూ నిర్మాత దిల్ రాజు సూచలను ఇచ్చాడు. కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు.

ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ కం అలనాటి యాక్టర్ అయిన జీవిత కూడా శ్రీకాంత్ అడ్డాలకు ఓ అవకాశం ఇవ్వనుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇకపై వస్తాయో లేదో కూడా చెప్పలేం. తనకు వచ్చిన క్రేజ్ ను గిఫ్టెడ్ గా భావించేసి.. ఇష్టం వచ్చినట్లు మూవీ చేస్తే పరిస్థితి ఎలా తిరగబడుతుందో చెప్పేందుకు ఉదాహరణగా నిలిచిపోయాడు శ్రీకాంత్ అడ్డాల.
Tags:    

Similar News