ఫ్యామిలీ సినిమాలను డీల్ చేయడంలో శ్రీకాంత్ అడ్డాల ప్రత్యేకతే వేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మల్టీ స్టారర్ ని డీల్ చేసిన తీరు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. కానీ అది గతం. అదే మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం తనకే కాదు హీరోకు సైతం ఎన్నటికీ మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ పేరు వింటే ఫ్యాన్స్ బెంబేలెత్తుతారు. దెబ్బకు గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం బయట ఎక్కడా కనిపించలేదు. తనతో ఎంతో సున్నితంగా ఉండే దర్శక మిత్రుల వేడుకల్లో ఎన్నడూ చూసిన దాఖలాలు లేవు. కొత్త స్క్రిప్ట్ కోసం సొంతూరికి వెళ్ళిపోయాడు అనే వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల త్వరలో శర్వానంద్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు వినికిడి
ఇందులో శర్వానంద్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. హీరోయిన్ సెలక్షన్ ఇంకా జరగాల్సి ఉంది. ఇది ఎలాగైనా హిట్టు కొట్టి తన క్యాలిబర్ ను రుజువు చేసుకోవాల్సిన అవసరం శ్రీకాంత్ అడ్డాలకు చాలా ఉంది. పరాజయాలు ఏ దర్శకుడికైనా సర్వసాధారణం. కానీ బ్రహ్మోత్సవం విషయంలో మాత్రం చాలా ఎక్కువ డోస్ లో బాధితుడిగా మారాడు శ్రీకాంత్ అడ్డాల. ఇతర విభాగాల కంటే ఇతనిలో రచయిత దర్శకుడినే అందరు ఆడిపోసుకున్నారు. సో శర్వా సినిమాతో కనక సాలిడ్ హిట్ కొడితే అందరికి సమాధానం చెప్పొచ్చు. ప్రస్తుతం పడి పడి లేచే మనసుతో పాటు సుధీర్ వర్మ షూటింగ్స్ లో బిజీగా ఉన్న శర్వానంద్ వీటి తర్వాత దీని రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.