మరోసారి శ్రీకాంత్ పైత్యం చూపించనున్నాడా?

Update: 2016-05-15 04:24 GMT
మానవీయ సంబంధాలను, కల్మషరహిత బంధాలను కోరుకునే దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తన సినిమాలు కూడా వీటినే ప్రతిబింబించడంతో యునీక్ డైరెక్టర్ గా ప్రస్తుత తరంలో ముద్ర వేసుకున్నాడు.

అయితే శ్రీకాంత్ తన సినిమాలలో చేసే కొన్ని ప్రయోగాలు కాస్త వెరైటీగా వుంటాయి. సీతమ్మ వాకిట్లో సినిమాలో స్టార్ హీరోలైన ఇద్దరికీ అసలు పేర్లే వుండవు. పెద్దోడు - చిన్నోడనే కొనసాగుతుంది సినిమా అంతా.. అలానే ముకుంద చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య మాటలే వుండకపోవడం మరో వెరైటీ. కదానుసారం ఇవేమీ అవసరం లేకపోయినా సినిమా కొలమానం ప్రకారం అవసరమే.

ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కూడా ఇలాంటిదే ఫాలో అవుతున్నటు తెలుస్తుంది. స్టార్ హీరోయిన్లు కాజల్ - సమంతాలకు సినిమాలో చోటు వున్నా వారిద్దరిమధ్యా ఒక్క సన్నివేశం కూడా లేదట. కధ డిమాండ్ చెయ్యట్లేదు సరే. మరి ఎన్నొ వేల కళ్ళతో మహేష్ తోపాటు ముగ్గురు హీరోయిన్లని ఒకే స్క్రీన్ పై చూడాలనుకున్న ప్రేక్షకుడి ఆశ ఏమవుతుంది?
Tags:    

Similar News