80 కోట్ల దర్శకుడు.. చిన్న సినిమా తీస్తాడట

Update: 2016-07-13 04:57 GMT
శ్రీకాంత్ అడ్డాల.. ఓ రెండు నెలల క్రితం వరకూ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో వినిపించిన పేరు ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలుకొట్టేస్తాడని అనుకున్న టైంలో.. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్., శ్రీకాంత్ అడ్డాల అంటే హీరోలు పక్కకు తప్పుకునేలా చేసింది.

బ్రహ్మోత్సవం రిజల్ట్ కంటే.. దాని నేరేషన్ అందరినీ ఆలోచింపచేసింది. ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయక తప్పని పరిస్థితి శ్రీకాంత్ అడ్డాలకు ఏర్పడింది. తెలుగులో అతి భారీ బడ్జెట్ తో సినిమా తీసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ఓ చిన్న సినిమా తీసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం దిల్ రాజును అప్రోచ్ కాగా.. ఆ నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత కూడా శ్రీకాంత్ అడ్డాల ట్యాలెంట్ పై దిల్ రాజుకు నమ్మకం ఉండడమే ఇందుకు కారణం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా మారి తీసిన తొలి రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజే. అవి రెండు హిట్స్ కాగా రెమ్యూనరేషన్ విషయంలో తేడాలతో విడిపోవాల్సి వచ్చిందనే టాక్ ఉంది.
Tags:    

Similar News