పాతికేళ్ల వెనక్కి శ్రీకాంత్ కెరీర్

Update: 2016-06-16 05:30 GMT
హీరోగా తన కెరీర్ కి ఎండ్ కార్డ్ పడిందనే ఫీలింగ్ కి రాగానే.. విలన్ గా వచ్చిన అవకాశాన్ని పక్కాగా వాడేసుకుని.. ఫుల్లు బిజీ అయిపోయాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు. ఏకంగా 17 సినిమాలకు సైన్ చేసేసి.. టాలీవుడ్ స్టార్ హీరోలు అడిగినా డేట్స్ లేవనే రేంజ్ కు చేరుకున్నాడు. పైగా ప్రతీ సినిమాకీ భారీ మొత్తాన్నే వసూలు చేసుకుంటున్నాడు. సీనియర్ హీరోలకు ఇప్పుడు జగపతి రోల్ మోడల్ అయిపోయాడని చెప్పచ్చు. ఇప్పటికే 'అహం' రాజశేఖర్ కూడా విలన్ రోల్ మొదలుపెట్టేశాడు. ఇప్పుడు మరో హీరో విలన్ టర్నింగ్ ఇచ్చేసుకుంటున్నట్లు సమాచారం.

కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ చేసి.. తర్వాత హీరోగా మారిపోయాడు శ్రీకాంత్. పాతికేళ్ల పాటు హీరోగా కంటిన్యూ అయిపోయి ఏకంగా వంద సినిమాల్లో నటించేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ ని సోలో హీరోగా పెట్టి సినిమా అంటే రిస్క్ కావడం, శాటిలైట్ కూడా అంతగా పలక్కపోవడంతో.. సినిమాలు తగ్గిపోయాయి. అందుకే నెగిటివ్ రోల్స్ వైపు శ్రీకాంత్ కూడా కన్నేశాడు. త్వరలో ఓ తమిళ్ స్టార్ హీరోకు విలన్ గా కనిపించి షాక్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

హీరో కేరక్టర్లే చేయాలనే లిమిట్స్ శ్రీకాంత్ ఎప్పుడూ పెట్టుకోలేదు. రీసెంట్ గా సరైనోడు చిత్రంలో బన్నీకి.. గోవిందుడు అందరివాడే మూవీలో రామ్ చరణ్ కి బాబాయ్ కూడా కనిపించాడు. అయితే.. కేరక్టర్ రోల్స్ ఆఫర్లు పెరుగుతుండడంతో.. విలన్ గా అయితే ఇంకా గ్రాండ్ గా ఉంటుందనే ఫీలింగ్ కి శ్రీకాంత్ వచ్చాడట. అదీ సంగతి.
Tags:    

Similar News