అక్క‌డ బాల‌య్య వ‌ర్సెస్ మ‌హేష్‌

Update: 2016-01-04 05:45 GMT
ఒక సినిమా వంద రోజులు ఆడే సంస్కృతి ఎప్పుడో పోయింది. ఇప్పుడన్నీ వారం, రెండు వారాల సినిమాలే. బాహుబ‌లిలాంటి సినిమా సైతం వంద రోజుల ముచ్చ‌ట లేకుండానే వెళ్లిపోయింది. కానీ ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ వంద రోజులు, రెండు వంద‌ల రోజులు అన్న ముచ్చ‌ట్లు వినిపిస్తూనే ఉన్నాయి. బాల‌కృష్ణ అయితే ఏకంగా 400 రోజుల రికార్డు కూడా సాధించాడు. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరులో త‌న లెజెండ్ 400 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌కృష్ణ  స్వ‌యంగా అక్క‌డికి వెళ్లి వేడుక చేసొచ్చాడు. 

అదే సెంట‌ర్‌ లోనే ఇప్పుడు మ‌హేష్ కూడా సెంచ‌రీల మీద సెంచ‌రీలు కొడుతున్నాడు. బాల‌య్య రికార్డుని బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే ల‌క్ష్య‌మా అన్న‌ట్టుగా మ‌హేష్ శ్రీమంతుడు  అక్క‌డ 150 రోజులు పూర్తి చేసుకొని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే క‌చ్చితంగా దాని వెన‌క అభిమానుల ప్ర‌మేయం ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. బాల‌కృష్ణ అభిమానుల ప్ర‌మేయంతోనే ఎమ్మిగ‌నూరులో లెజెండ్ 400రోజులు ఆడింది. మ‌హేష్ అభిమానులు కూడా శ్రీమంతుడుని మ‌రికొన్ని రోజులు  ఆడించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు తెలిసింది. 
Tags:    

Similar News