అమెరికాలో శ్రీ‌మంతుడు 50 డేస్‌!!!

Update: 2015-09-05 16:59 GMT
మ‌హేష్ సినిమాల్లో కి రాక‌ముందు ఒక ఎన్నారై. విదేశాల్లో చ‌దువుకుని స్వ‌దేశాని కి వ‌చ్చిన శ్రీ‌మంతుడు. అయినా ఇన్నాళ్టికి శ్రీ‌మంతుడు చిత్రంలో ఎన్నారై క్యారెక్ట‌ర్‌ లోనే న‌టించాడు. ఈ సినిమాని తీసిన నిర్మాత‌లు కూడా ఎన్నారైలే. అందుకే డ‌బ్బున్న‌వాడు సొంత ఊరికి మేలు చేస్తే త‌ప్పేంలేదు అని పంతం ప‌ట్టే ఓ న‌వ‌త‌రం యువ‌కుడి గా న‌టించి ప్రిన్స్ అంద‌రి మ‌న‌సులు దోచాడు. డ‌బ్బు కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది అని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. స‌రిగ్గా ఈ పాయింట్ అమెరికాలో ఉంటున్న మ‌న ఎన్నారై ల‌ను ఎక్క‌డో ట‌చ్ చేసింది. క‌ట్ చేస్తే 3 మిలియ‌న్ డాల‌ర్లు కుంభ‌వృష్టిలా కురిశాయి. ఎర్నేని బ్ర‌ద‌ర్స్ జాత‌కం ఒక్క సినిమాతో మారిపోయింది. దాదాపు 150 కోట్ల గ్రాస్‌ వ‌సూళ్లు సాధించిన ఏకైక తెలుగు సాంఘీక చిత్ర‌మిది.

తెలుగు సినిమా 85ఏళ్ల హిస్ట‌రీ లో ఇలాంటి రికార్డు వేరొక‌టి లేదు. జాన‌ప‌దం, ఫిక్ష‌న్‌ లో వ‌చ్చిన బాహుబ‌లి త‌ర్వాత అంత‌టి క్రేజు తెచ్చుకున్న చిత్ర‌మిది. ఇందులో మెజారిటీ వ‌సూళ్లు ఎన్నారైల ఆద‌ర‌ణ వ‌ల్ల ద‌క్కాయి. అందుకే నిర్మాత‌లు నార్త్ అమెరికా లో శ్రీ‌మంతుడు అర్థ శ‌త‌దినోత్స‌వం 50రోజులు వేడుక‌ను నిర్వ‌హించేందుకు సంసిద్ధ‌మ‌వుతున్నారని టాక్‌. మ‌హేష్ అపుడెపుడో సైనికుడు సినిమా కోసం అమెరికా వెళ్లి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. మ‌ళ్లీ ఇంత‌ కాలానికి మ‌రోసారి అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అమెరికాలో 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు తెచ్చిన హీరో మ‌హేష్‌. ఇప్పుడు ఆ రేంజును 3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు తీసుకెళ్లిన స‌త్తా ఉన్న హీరో కూడా అత‌డే. కాబ‌ట్టి నిర్మాత‌లు ఎన్నారైల‌కు థాంక్స్ చెప్పుకో్వ‌డానికి ఈ సినిమానే క‌రెక్టు అని భావిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎర్నేని బ్ర‌ద‌ర్స్‌. ఇది మీ భ‌విష్య‌త్‌కు కూడా మ‌రీ మంచిది. ఎన్నారైల నుంచి కోట్లాది రూపాయ‌ల్ని టాలీవుడ్‌లో కి ప్ర‌వ‌హింప‌జేసే ఛాన్స్ మీ ముంగిట‌కే వ‌స్తుంది ఇక‌.
Tags:    

Similar News