శ్రీ‌మంతుడి సైకిల్ ఎవ‌రికి ద‌క్కేనో?

Update: 2015-11-13 04:49 GMT
వెన‌క‌బాటుకు గురైన ఊరిని ఆదుకునేందుకు ఎవ‌రో ఒక‌రు రావాలి. ప‌ల్లెటూళ్ల‌లో పాతుకుపోయిన దుర్మార్గ‌పు రాజ‌కీయాల్ని ఎదిరించే మ‌గాడు రావాలి. గుండెల్లో ఖ‌లేజా ఉన్నోడు, దుర్మార్గుల గుండెల్లో గున‌పం అయ్యేవాడు, అన్నిటినీ ఒంటి చేత్తో జ‌యించేవాడు దిగి రావాలి. వాడు ఎన్నారై అయి ఉంటే, బాగా ధ‌న‌వంతుడై ఉంటే ఇంకా మంచిది. ఇదే విష‌యాన్ని శ్రీ‌మంతుడు చిత్రంలో తెలివిగా చూపించి రికార్డులు కొట్టేశాడు కొర‌టాల శివ‌.

ఓ రిచ్‌ గ‌య్ త‌న సొంత ఊరికి తిరిగి వ‌చ్చి ఎలా డెవ‌ల‌ప్ చేశాడు? ఊరిని ద‌త్త‌త తీసుకుని దాని రూపురేఖ‌ల్ని ఎలా మార్చేశాడు? అన్న క‌థాంశంతో కొర‌టాల తెర‌కెక్కించిన శ్రీ‌మంతుడు బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. అయితే సినిమా ప్ర‌మోష‌న్‌ లో శ్రీ‌మంతుడు డ్రైవ్ చేసిన సైకిల్‌ ని అభిమానుల‌కు కానుక‌గా ఇచ్చేస్తామ‌ని కాంటెస్ట్ ఒక‌టి ర‌న్ చేశారు. ఇప్పుడు కంటెస్టెంట్ విన్న‌ర్స్‌ ని ఎంపిక చేసే టైమ్ వ‌చ్చింది.

శ్రీ‌మంతుడు ఈ నెల 14తో 15 కేంద్రాల్లో 100రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా కంటెస్ట్‌ లో పాల్గొన్న‌వారి నుంచి విన్న‌ర్స్‌ ని ఎంపిక చేసి ఈనెల 16న సైకిల్‌ ని గిఫ్ట్‌ గా ఇవ్వ‌నున్నారు. ప్రిన్స్ మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు చిత్రంలో ఉప‌యోగించిన ఆ సైకిల్‌ ని ఎవ‌రు ద‌క్కించుకుంటారో? ఎవ‌రో ఆ అదృష్ట వంతుడు?
Tags:    

Similar News