శ్రీమంతుడికి సెన్సార్‌ కట్స్‌ లేవ్‌

Update: 2015-08-04 13:31 GMT
మహేష్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైంది. వన్‌ .. టు .. త్రీ .. ఇక మూడే రోజులు. ఫలితం తేలిపోయే రోజొచ్చేస్తోంది. ఆగస్టు 7 రిలీజ్‌ తేదీ ఆసన్నమైంది. ఈరోజే సెన్సార్‌ రిపోర్ట్‌ కూడా వచ్చేసింది. ఈ సినిమాకి ఎలాంటి కట్స్‌ విధించకుండా సెన్సార్‌ సభ్యులు యుఎ సర్టిఫికెట్‌ ఇచ్చి గౌరవించారు. అంతేకాదండోయ్‌ సెన్సార్‌ బృందం శ్రీమంతుడిని ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఇటీవలి కాలంలో గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, బంధాలు-అనుబంధాలకు సంబంధించిన సినిమాలు తగ్గిపోయాయ్‌. శ్రీమంతుడు వాటన్నిటినీ గుర్తు చేస్తాడు అంటూ పొగిడేశారు. అంతేనా ఇది దేశం వదిలి వెళ్లిపోతున్న ఎన్నారై లకు కనువిప్పు కలిగిస్తుందని ముక్తకంఠంతో చెప్పారు. ఆడియో తోనే శ్రీమంతుడు మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు సెన్సార్‌ సభ్యుల రూపంలో రెండో మెప్పు వచ్చింది. ఇక హిట్‌ కొట్టేయడం ఖాయమైపోయినట్టే. రెట్టించిన అంచనాల్ని బట్టి శ్రీమంతుడు ఈసారి రికార్డులు తిరగరాయడం ఖాయం అనే అనిపిస్తోంది. ఓ వైపు ఓవర్సీస్‌ లో ఎన్నారైలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అసలే ఎన్నారై కథ. బిలియనీర్‌ కథ. భారతదేశం వెళ్లి గ్రామాన్ని దత్తత తీసుకుని శ్రీమంతుడు ఏమేమి చేశాడు? ఇలాంటి అవకాశం వస్తే మేమైతే ఏం చేస్తాం? అనే కోణంలో అంతా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. 3మిలియన్‌ డాలర్లను ఓవర్సీస్‌ నుంచి కొల్లగొడితే చాలు. అలాగే ఇండియాలో 60కోట్లు పైబడిన రాబడి తెచ్చేశాడంటే శ్రీమంతుడు అనుకున్న టార్గెట్‌ ని రీచ్‌ అయినట్టే.
Tags:    

Similar News