స్టార్ కమెడియన్లు ఎందరు ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి. స్టార్ హీరోలతో పాటు, నవతరం హీరోలకు అతడు సపోర్టివ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, తర్వాత రెడ్డికే బాగా పేరొచ్చింది. ఆ తర్వాత నవతరం కమెడియన్ల వెల్లువ పెరిగినా తనకంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాడు.
ముఖ్యంగా మనోడు ఈడియట్ సినిమాలో.. అరేయ్ నాకు ఒక టీ చెప్పండ్రా అంటే.. నాకొక బూస్ట్ అని అంటాడు. .వెంటనే పక్కనే ఉన్న పోలీసు మనోడ్ని తంతాడు.. ఆ సీన్‌తో సూపర్ ఫ్యామస్ అయ్యాడు. ఇప్పుడిక ఏకంగా.. అంజలి టైటిల్ పాత్రలో నటించిన గీతాంజలి చిత్రంలో సినిమాని నడిపించే లీడ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సినిమాలో కథానాయికతో డ్యూయెట్ వేసుకుని హీరోయిజం చూపించడానికి ఆస్కారం లేకపోయినా అంజలిని ఇష్టపడే అమాయకపు కుర్రాడిలాగా బాగానే ఆకట్టుకున్నాడు. కాని సోలో లీడ్‌గా చేయలేకపోయాడు.
ఇప్పుడు అలా కాకుండా సునీల్ తరహాలోనే పూర్తిగా మొత్తం సినిమా కథను నడిపించే కథానాయకుడిగా అవకాశం అందుకున్నాడని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఆ వివరాల్ని వెల్లడించనున్నారు. కథానాయిక, ఇతర కాస్టింగ్ వివరాల్ని కూడా తెలియజేస్తారు. పైగా మనోడే ఈ సినిమాలో డబ్బులు కూడా పెట్టేస్తున్నాడట.