'దూకుడు'పై అలా డౌట్ ప‌డ్డాడ‌ట‌

Update: 2019-12-27 04:42 GMT
త‌ప్పు చేయ‌ని మ‌నిషి ఉంటాడా? అయితే ఆ త‌ప్పును తెలుసుకుని క‌రెక్ట్ చేసుకుంటే స‌క్సెస్ దానంత‌ట అదే వ‌స్తుంది. అయితే ఆ త‌ప్పును కాస్త ఆరంభ ద‌శ‌లో క‌నిపెడితేనే మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. అయితే అంతా అయ్యాక త‌ప్పును క‌నిపెట్టాన‌ని అన‌డం వైట్ల‌కు ఎంత‌వ‌ర‌కూ ఉప‌యుక్త‌మో త‌నే చెప్పాలి.

గ‌తం గ‌తః అనుకుని తిరిగి త‌న‌ని తాను కెరీర్ ప‌రంగా రీబూట్ చేసుకునే ప‌నిలో ఉన్న శ్రీ‌నువైట్ల 2020లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ప్ర‌ణాళికల్లో ఉన్నాడు. ఈ సంద‌ర్బంగా ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేశాడు. అస‌లు త‌ప్పులు ఎందుకు జ‌రిగాయి.. ఎలా జ‌రిగాయి? అన్న విష‌యాల్ని నామోషీ లేకుండా వైట్ల‌ పంచుకున్నాడు.

ఏదైనా ఒక స్క్రిప్ట్ అనుకుంటే సెకండ్ థాట్ ఉండ‌దు. దాని పైనే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లి పోతాను. ఒకే ఒక్క‌సారి  స్క్రిప్టు విష‌య‌మై రీవ‌ర్క్ చేశాను. అది కూడా దూకుడు విష‌యంలో. అప్ప‌టికే మ‌హేష్ తో పాటు నిర్మాత‌లు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 80 శాతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్త‌యి పోయింది. అంత జ‌రిగాక ఇంకా నాకు డౌట్ క‌లిగి స్క్రిప్టుపై తిరిగి ప‌ని చేశాను. దానివ‌ల్ల దూకుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది అని ఆ ర‌హ‌స్యాన్ని ఓపెన్ గా చెప్పాడు.

అంద‌రూ కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను ఇంకా ప‌ని చేయాల‌ని ఇది ప్రూవ్ చేసింది. స్క్రిప్టు విష‌యం లో ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో ఆ ప‌రిణామం అర్థ‌మ‌య్యేలా చెప్పింది. మొత్తానికి నా త‌ప్పు తెలుసుకున్నా.. అని వెల్ల‌డించాడు. 2020లో ఘ‌న‌మైన రీఎంట్రీ ఇస్తాన‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని వైట్ల అన్నారు. ఇప్ప‌టికే నాలుగైదు స్క్రిప్టు లు రెడీ గా ఉన్నాయి. విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకున్నాను. అందులో పూర్తి స్థాయి వినోదానికి ఆస్కారం ఉన్న‌దే ఫైన‌ల్ చేశాను. 80శాతం స్క్రిప్టు పూర్త‌యింది. పెండింగ్ 20శాతం పూర్తి చేశాక‌.. కొత్త సంవ‌త్స‌రంలో నా సినిమా వివ‌రాల్ని ప్ర‌క‌టిస్తాను అని తెలిపారు.


Tags:    

Similar News