తేజ చాలా బాగా మాట్లాడతాడు... ఆ మాటల్ని నేను భలే ఎంజాయ్ చేస్తుంటా, అందుకే తేజ ఇచ్చే ప్రతీ ఇంటర్వ్యూ ని నేను తప్పనిసరిగా చూస్తుంటా అన్నాడు శ్రీనువైట్ల. బ్రూస్ లీ వల్ల ఇటీవల తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలు మాత్రం చూడలేకపోయానని, త్వరలోనే వాటిని తీరిగ్గా కూర్చుని చూస్తానని స్పష్టం చేశాడు. ఇంతకీ శ్రీనువైట్లకి తేజ ఇంటర్వ్యూలు చూడాలనే ఆలోచన ఎందుకొచ్చిందనేగా మీ సందేహం... ఆ విషయానికే వస్తున్నాం.
హోరా హోరీ ఆడియో ఫంక్షన్ లోనూ, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ తేజ బోలెడన్ని కబుర్లు చెప్పాడు. తెలుగులో రెండే కథలు తీస్తున్నారని.. విలన్ ఇంట్లోకి హీరో దూవడం, అక్కడ అందరినీ బకరాల్ని చేయడమే ఓ కథ అనీ, ఆ కథనే పదే పదే తీస్తున్నారని, దాన్నే మనోళ్లు మళ్లీ మళ్లీ చూసి సక్సెస్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నిజానికి అది శ్రీనువైట్ల మార్క్ ఫార్ములా. ఢీ - రెఢీ మొదలుకొని అదే ఫార్ములాతో సినిమాలు తీస్తూ వస్తున్నారు వైట్ల. మరి తేజ మాటలు మీ శైలిని విమర్శిస్తున్నట్టున్నాయి కదా. మీరు ఆ మాటల్ని విన్నారా? అని ఇటీవల శ్రీనువైట్లని విలేకర్లు అడిగారు. అందుకు స్పందించిన శ్రీనువైట్ల త్వరలోనే చూస్తానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆడియో వేడుకలోనూ, ఇంటర్వ్యూల్లోనూ తేజ చెప్పిన మాటల్ని వినుంటే శ్రీనువైట్ల నుంచి తప్పకుండా సెట్టైరికల్ సమాధానం వచ్చేది. ఎందుకంటే శ్రీనువైట్ల సెట్టైర్లు భలే వేస్తుంటాడు.