వైట్ల 'మిస్టర్'.. పర్ఫెక్ట్ గా రెడీ

Update: 2016-04-22 04:04 GMT
ఆగడు, బ్రూస్ లీ చిత్రాల వరుస ఫ్లాప్స్ తర్వాత.. శ్రీనువైట్ల మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా 'మిస్టర్' అనే టైటిల్ పై తెరకెక్కనున్న చిత్రంలో లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్ గా, హేభా పటేల్ సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. ఏప్రిల్ 8న ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం.. కొంత ఆలస్యంగా మే 15న స్పెయిన్ లో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో మాటలు వినిపిస్తున్నా ప్రారంభం లేట్ అవడానికి తగిన కారణాలే ఉన్నాయని వైట్ల సన్నిహుతులు అంటున్నారు. 'శ్రీను వైట్ల ఇప్పుడు పూర్తిగా తన సబ్జెక్ట్ పైనే దృష్టి పెట్టాడు. అందుకే కొంత ఆలస్యం జరగుతోంది. మిస్టర్ విషయంలో ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు. అంత పర్ఫెక్ట్ గా ఈ చిత్రం రెడీ అయింది. అలాగే గతంలో మాదిరిగా హడావిడిగా సినిమా కంప్లీట్ చేసేయాలనే తొందర కూడా లేదు' అంటున్నారు.

స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన గోపీ మోహన్ కూడా మిస్టర్ కోసం శ్రీనువైట్లతో జత కలిశాడు. అలాగే మరో రైటర్ శ్రీధర్ సీపన కూడా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న మిస్టర్ ను.. టాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News