ఒకప్పుడు ఒక సినిమా విజయాన్ని కొలవడానికి ఎన్ని సెంటర్లలో యాభై రోజులాడిందో.. వంద రోజుల సెంటర్లు ఎన్ని పడ్డాయో చూసేవాళ్లు. కాల క్రమంలో సెంటర్లు పోయి.. కలెక్షన్లే ప్రామాణికం అయ్యాయి. తొలి రోజు ఎంత వసూలు చేసింది.. వీకెండ్ వసూళ్లెన్ని.. ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేసింది అని చూస్తున్నారు. ఐతే ఇప్పుడు ఈ ట్రెండు కూడా పోయి.. త్వరలో ఒక సినిమాను ఎంతమంది చూశారు అనేది ప్రామాణికం అయిపోతుందేమో అనిపిస్తోంది ‘శ్రీరస్తు శుభమస్తు’ కొత్త ప్రమోషనల్ పోస్టర్లు చూస్తుంటే. ఈ సినిమాను ఇప్పటిదాకా 32 లక్షలమంది చూశారట. ఆ 32 లక్షలమందికి కృతజ్నతలు చెబుతూ నాలుగో వారం పోస్టర్లు వేసింది గీతా ఆర్ట్స్ టీమ్.
‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి టాక్ తోనే మొదలైంది. దీనికి అయిన పెట్టుబడి ఎంత.. వచ్చిన రాబడి ఎంత అనే విషయంలో వివరాలు తెలియట్లేదు. బయ్యర్లకు లాభాలు వచ్చాయి అంటున్నారు కానీ.. ఎంత ఏంటి అన్నది చెప్పట్లేదు. కలెక్షన్ల లెక్కలు చెప్పకుండా వెరైటీగా ఈ సినిమాను 32 లక్షలమంది చూశారంటూ ప్రచారం మొదలుపెట్టడం ఆశ్చర్యం కలిగించేదే. ఆ సంగతలా వదిలేస్తే ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. శిరీష్ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టింది. అది అల్లు ఫ్యామిలీకి సంతోషాన్నిచ్చే విషయమే. అందుకే సినిమా రన్ దాదాపుగా పూర్తి కావస్తున్నా.. నాలుగో వారంలోనూ ప్రమోషన్ ఆపట్లేదు.