బన్నీ నటించిన 'పుష్ప'తో రష్మిక, హోంబలే ఫిలిమ్స్ 'కాంతార'తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ఇద్దరు స్టార్ల మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. కన్నడ ప్రేక్షకులు కూడా రష్మికని ప్రతీ సందర్భంలోనూ టార్గెట్ చేస్తూ నెట్టింట కామెంట్ లతో వైరల్ చేస్తున్నారు. 'కాంతార' సినిమా ఇంకా చూడలేదా ? అంటూ కన్నడ ఫ్యాన్స్ రష్మికపై నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.
దీనిపై రష్మిక వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తాను సినిమాని లేట్ గా చూశానని, ఆ విషయాన్ని మేకర్స్ కి వెళ్లిడిస్తూ అభినందనలు కూడా తెలిపానని ప్రకటించింది. దీంతో శాంతించిన కన్నడ ఫ్యాన్స్ రష్మికకు కాస్త రిలీఫ్ ఇచ్చారు. ఇదిలా వుంటే 'కాంతార' మూవీతో పాన్ ఇండియా వైడ్ గా చర్చనీయాంశంగా మారిన హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాత్రం రష్మికని వదలడం లేదు. అవకాశం చిక్కినప్పుడల్లా రష్మికప పంచ్ లేస్తూనే వున్నాడు.
రష్మిక మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేసినా రిషబ్ మాత్రం తనదైన స్టైల్లో రష్మికపై కామెంట్ లు చేస్తూనే వున్నాడు. తాజాగా రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రక్షిత్ శెట్టి (రష్మిక మాజీ ప్రియుడు) హీరోగా రిషబ్ శెట్టి రూపొందించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ 'కిరిక్ పార్టీ'. 2016 డిసెంబర్ 30న ఈ మూవీ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే మూవీతో రష్మిక మందన్న హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ శుక్రవారంతో ఈ మూవీ విడుదలై ఆరేళ్లవుతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. మా సినిమా విడుదలై ఆరేళ్లు అయినప్పటికీ.. మా కోసం మీరు చేసిన సందడి, థియేటర్లలో మీరు వేసిన విజిల్స్ మా చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. మమ్మల్ని మరో సారి ఆరోజుల్లోకి తీసుకెళుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ , మ్యూజిక్ డైరెక్టర్ లోక్ నాథ్ పేర్లని ట్యాగ్ చేశాడు.
అయితే ఇందులో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న పేరుని అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం. కావాలనే రిషబ్ తనని అవాయిడ్ చేయడంతో ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సైలెంట్ గా వున్న రష్మికపై రిషబ్ కావాలనే ఇండైరెక్ట్ గా పంచ్ వేశాడని నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.