ఇటీవలి కాలంలో శ్రీయ శరణ్ ఓ హాట్ టాపిక్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ నాయికగా నటించిన అనుభవం ఈ అమ్మడి సొంతం. ఇప్పటికీ నవతరం నాయికలతో పోటీపడుతూ అవకాశాలు అందుకుంటోంది.
అయితే తెలుగు, హిందీ పరిశ్రమలపై ఈ అమ్మడి మక్కువ తీరలేదింకా. ఇటీవలే మనం, గోపాల గోపాల చిత్రాలతో విజయాలు అందుకుని కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం కెరీర్ ఆశించినంతగా లేదు. దశాబ్ధం పైగానే సాగిన ఈ అమ్మడి కెరీర్‌లో ఇంతవరకూ రివీల్ చేయని ఓ సంగతిని ఇలా చెప్పుకొచ్చింది.
ఇటీవలే అనుకోకుండా నా క్లాస్‌మేట్‌ని కలిశాను. అవాక్కయ్యే అనుభవమది. తను ముందుగా గుర్తు పట్టలేకపోయింది. తర్వాత నేను నీ క్లాస్‌మేట్‌ని అంటూ నన్ను నేను పరిచయం చేసుకోవాల్సొచ్చింది అని చెప్పింది శ్రీయ. అంతేనా స్కూలు రోజుల్లో తలనిండా కొబ్బరి నూనె, సోడాబుడ్డి కళ్లద్దాలు, జిడ్డు మొహంతో ఏదోలా ఉండేదాన్ని. ఆ గెటప్‌లో ఉన్న నేను ఇలా మారిపోయానంటే నమ్మలేకపోయింది. అందుకే వెంటనే గుర్త పట్టలేకపోయింది అంటూ చెప్పుకొచ్చింది.
సుబ్బలక్ష్మి కాస్తా సిటీకొచ్చాక సుభా లక్ష్మిగా మారిన చందంగా శ్రీయ కూడా అలా మ్యానేజ్ చేసేసిందన్నమాట. కాకపోతే ఇప్పుడు శ్రీయను ఎలా చూసినా కూడా యూత్‌కు ఫుల్ కిక్కు వచ్చేస్తోంది మరి.