ఫోటో స్టోరి: పూల్ సైడ్ ఖాన్ డాట‌ర్ దుమారం

Update: 2021-07-25 02:30 GMT
స్టార్ కిడ్స్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలకు ఎక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిదీ ఇక్క‌డ ఓపెన్ గానే.. ఏదీ దాప‌రికం ఉండ‌దు. చాలా మంది న‌ట‌వార‌సురాళ్లు త్వ‌ర‌లో డెబ్యూలుగా రంగే ప్ర‌వేశం చేస్తుండడంతో ఇన్ స్టాల్ని ప‌బ్లిక్ చేశారు. అక్క‌డ ర‌చ్చ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటోంది.

చిట్టి పొట్టి నిక్క‌ర్లు.. బికినీలు.. డ్యాన్సింగ్ వీడియోలు.. యోగా జిమ్ సెష‌న్లు.. పూల్ సైడ్ ట్రీట్ లు.. ఒక‌టేమిటి మ‌స్త్ మ‌జా ట్రీట్ తో చెల‌రేగుతున్నారు.  నిజానికి స్టార్ అవ్వ‌క ముందే డాట‌ర్స్ సోష‌ల్ మీడియాలో అంద‌చందాల‌తో ఏ స్థాయిలో పిచ్చెక్కిస్తున్నారో చూస్తున్నదే... అతిలోక సుంద‌రి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్.. కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు సుహానా త్వ‌ర‌లో డెబ్యూ ఇస్తున్నారు. ఈ భామ‌ల‌ హాట్ హాట్ ఫోటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సునామీలా దూసుకెళుతున్నాయి.

ఇక షారుఖ్ ఖాన్- గౌరీఖాన్ ల ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ డెబ్యూ ఈపాటికే జ‌గ‌రాల్సిన‌ది. కానీ క‌రోనా వ‌ల్ల ప్ర‌తిదీ వాయిదా ప‌డింది. కానీ సుహానా సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతూనే ఉంటుంది.  తాజాగా సుహానా స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్ గా మారింది. అలా పూల్ సైడ్ ఎంజాయ్ మెంట్ మూడ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. పూల్ ఒడ్డున వైట్ టాప్ లో ..బ్లూ డెనిమ్ షార్ట్ లో సుహానా త‌ళుక్కున మెరిసింది.

ఈ ఫోటోని క్లిక్ చేసింది ఎవ‌రో తెలుసా.. త‌న మామ్ గౌరీఖాన్. సుహానా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. దీంతో షారుక్ ఆఫోటో పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. గారాల ప‌ట్టి ఎలాంటి డ్రెస్ వేసినా ఎంతో అందంగా ఉంటుంద‌ని ఖాన్ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. ఇక షారుక్ స‌హ‌న‌టి మ‌హిర్ ఖాన్... గౌరీ ఖాన్ ని ఉద్ధేశించి పొగిడేస్తూ ఉత్త‌మ ఫోటో గ్రాప‌ర్ అని అన్నారు.. సుహానా ఎలాంటి దుస్తుల్లోనైనా   అందంగా క‌నిపిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సుహానా డెబ్యూ సినిమా సెట్స్ కెళుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News