ఈవిడ పిట్ట క‌థ‌లు అల్లేస్తుంది

Update: 2015-12-07 05:05 GMT
దేవుడా నువ్వు బావుండాలి... నువ్వే బావుండాలి! అంటూ `బిజినెస్‌ మేన్‌`లో పిట్ట క‌థ వినిపించాడు పూరీ.  ఇలాంటి పిట్ట‌క‌థ‌లు అల్లాలంటే అంత పెద్ద డైరెక్ట‌ర్ కాన‌క్క‌ర్లేదు. కాసింత మెద‌డు ప‌నిచేసే వాళ్ల‌యితే చాలు. అలాంటి పిట్ట‌క‌థ‌లు పుట్టించే ట్యాలెంటు ఏ క‌థానాయిక‌లో ఉంది? అని ఆరాతీస్తే.. నేనున్నా అంటూ ముందుకొచ్చింది శ్రుతిహాస‌న్‌.

క‌థ‌లు అల్లేయ‌డంలో న‌న్ను కొట్టేవాళ్లే లేరు అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ‌. ఇప్పుడైతే క‌థానాయిక‌గా బిజీగా ఉండి క‌థ‌లు రాయ‌డం లేదు కానీ, చిన్న‌ప్పుడు క‌థ‌లు రాయ‌డ‌మే ప‌నిగా బ‌తికేసేదాన్ని. ఎక్క‌డైనా ఏదైనా ఓ ఇన్సిడెంట్ జ‌రిగితే దానికి ముందు ఏం జ‌రిగింది? త‌ర్వాత ఏం జ‌రిగింది? వ‌ంటి విష‌యాల్ని నేను ఇట్టే చెప్పేసేదాన్ని. వాట‌న్నిటినీ క‌థ‌లుగా అల్లేసి స్నేహితులంద‌రికీ చెప్పేదాన్ని. ఆ క‌థ‌లు విని బాప్‌రే అంటూ అంద‌రూ మెచ్చేసుకునేవారు. నాన్న అయితే తెగ న‌వ్వేసుకునేవాడు. నీకు క‌థ‌లు అల్ల‌డం అప్పుడే అల‌వాటైపోయిందా? అంటూ న‌వ్వేసేవారాయ‌న‌. అంటూ చెప్పుకొచ్చింది ఈ సుంద‌రి. శ్రుతి ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ప్రేమ‌మ్ రీమేక్‌ లో న‌టిస్తోంది. సేమ్ టైమ్ అటు హిందీ ప్రాజెక్టుల‌తోనూ బిజీగా ఉంది.  

ఇప్పుడున్న స‌న్నివేశంలో శ్రుతి క‌థార‌చ‌యిత అవ్వ‌డం కుద‌ర‌దు. ఒక‌వేళ క‌థానాయిక‌గా ఖాళీ అయిపోతే గ‌నుక అప్పుడు ఈ స్కిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎలానూ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి వ‌చ్చింది కాబ‌ట్టి క‌థ‌లు రాస్తూ ద‌ర్శ‌కురాలిగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. దానికింకా టైముంది మ‌రి!
Tags:    

Similar News