హీరోయిన్ కావాలంటే అందుకు ఒప్పుకోవాల్సిందే!!

Update: 2017-03-10 08:01 GMT
బాలీవుడ్ లో హీరోలకు - నిర్మాతలకు - దర్శకులకు అన్నీ సమర్పించుకుంటే ఛాన్సులు వస్తాయని ఆ మధ్య టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓపెన్ గా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ లోనూ అదే పరిస్థితి ఉందని ఓ కన్నడ హీరోయిన్ ఆరోపించడం సంచలనంగా మారింది.  అన్నీ వదులుకుంటే తప్ప అక్కడ హీరోయిన్లుగా నిలదొక్కుకోలేరని చెబుతోంది. తన గౌరవం కాపాడుకోవడానికే తాను టాలీవుడ్ కు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది.
    
కన్నడ నటి  శృతి హరిహరన్‌ తెలుగు చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 'కాస్టింగ్‌ కౌచ్‌' సంస్కృతి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతగా ఇంకెక్కడా లేదని  ఆమె ఆరోపించింది. కొత్త హీరోయిన్లకి గౌరవం, రక్షణ లేవని ఆమె పేర్కొంది.  కాంప్రమైజ్‌ కాకపోతే తెలుగు చిత్ర సీమలో హీరోయిన్‌ గా నిలబడలేరని ఆమె తీవ్రమైన ఆరోపణలే చేసింది.  తెలుగు చిత్ర సీమతో పోల్చుకుంటే కన్నడ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ పద్ధతి చాలా తక్కువ అని, తన గౌరవం కాపాడుకునేందుకు కన్నడ సినిమాకే పరిమితమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.
    
కాగా టాలీవుడ్ లో పరిస్థితులపై  ఒక హీరోయిన్‌ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. రాధికా ఆప్టే కూడా తెలుగు చిత్ర సీమలో హీరోయిన్లని హీనంగా చూస్తారని, ఒక హీరో తనని డైరెక్టుగా కోరిక తీర్చమని అడిగాడని ఆమె ఆరోపించింది.  అయితే.. ఇక్కడున్న స్టార్ హీరోయిన్లు మాత్రం అంతా బాగుందని అంటుంటారు. మరి అన్నిటికీ సిద్ధపడి అవకాశాలు అందుకుంటుండడం వల్ల వారికి అంతా బాగుంటున్నట్లు ఉంటుందో లేదంటే నిజంగానే ఇక్కడ బాగుందో వారికే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News