`బాహుబలి` సినిమాకి సంబంధించిన ప్రతీ పోస్టర్ లోనూ మేఘాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు అఖిల్ సినిమా పోస్టర్ లోనూ ఇంచు మించు అలాంటి మేఘాలే కనిపిస్తున్నాయి. బాహుబలిని ఫాలో అయ్యారా ఏంటబ్బా అని ఆరా తీస్తే... ఈరెండు పోస్టర్ల ను డిజైన్ చేసింది ఒక్కరే అని తేలింది. ఆయనెవరో కాదు... రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ. షోయింగ్ బిజినెస్ పేరుతో రాజమౌళి తనయుడు ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. పబ్లిసిటీ కంటెంట్ ని క్రియేటివిటీతో అందిస్తుంటుంది ఈ సంస్థ. ఇదివరకు `మనం`, `ఊహలు గుసగుసలాడే`, `ఒక లైలా కోసం`, `బాహుబలి` తదితర చిత్రాలకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ లోనూ, పోస్టర్ల డిజైనింగ్ లోనూ ఈ సంస్థ పాలు పంచుకొంది. తాజాగా అఖిల్ సినిమాకీ కార్తికేయ సంస్థ షోయింగ్ బిజినెస్ పనిచేస్తోంది.
అఖిల్ కీ, కార్తికేయకీ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ అనుబంధంతోనే తన సినిమాకి సంబంధించిన వీడియో కటింగులు, పోస్టర్ డిజైనింగ్ బాధ్యతల్ని కార్తికేయకి అప్పగించాడు అఖిల్. అరచేతిలో బంతిని పెట్టుకొని ఆకాశంకేసి చూస్తున్న అఖిల్ పోస్టర్ ని డిజైన్ చేయించింది కార్తికేయనే. ఆ పోజు నిజంగా గ్రాండియర్ గా, ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంది. తన పోస్టర్ ని తీర్చిదిద్దిన విధానం చూసి అఖిల్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. నిర్మాత నితిన్ కూడా కార్తికేయని అభినందించాడు. రేపు విడుదల కాబోతున్న టీజర్ లోనూ కార్తికేయ క్రియేటివిటీ ఉంటుందని సమాచారం. మొత్తంగా రాజమౌళి తనయుడిని మంచి క్రియేటివిటీతో కూడిన ఓ టెక్నీషియన్ గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది.