#RRR లో కార్తికేయ పని ఇదే

Update: 2019-03-06 06:13 GMT
'బాహుబలి' సినిమా షూటింగ్‌ సమయంలో ఆ పని ఈ పని అనే తేడా లేకుండా అన్ని పనులను రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకున్నాడు. ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. కార్తికేయ ప్రొడక్షన్‌ బాయ్‌ గా - పబ్లిసిటీ డిజైనర్‌ గా ఇంకా ఎన్నో రకాలుగా వర్క్‌ చేశాడని పలు వేదికలపై రాజమౌళి చెప్పడం జరిగింది. ప్రస్తుతం కార్తికేయ తన బిజినెస్‌ లు - ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇంకా తన కబడ్డీ జట్టుతో బిజీగా ఉన్న కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ మూవీకి వర్క్‌ చేయడం లేదని అంతా భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం కాస్టింగ్‌ షెడ్యూల్స్‌ ను కార్తికేయ చూసుకుంటున్నాడట.

ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన డేట్ల అరెంజ్‌ మెంట్స్‌ అన్ని కూడా కార్తికేయ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ - ఎన్టీఆర్‌ లు బల్క్‌ గా డేట్లు ఇచ్చేశారు. వారిద్దరితో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ముఖ్య తారాగణం నుండి ఎప్పుడు డేట్లు తీసుకోవాలి - వారి డేట్లతో చరణ్‌ - ఎన్టీఆర్‌ డేట్లను ఎలా ప్లాన్‌ చేయాలనే విషయాన్ని కార్తికేయ చూసుకుంటున్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవగన్‌ తో పాటు హీరోయిన్‌ ఆలియా భట్‌ ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు కార్తికేయ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వారి పాత్రలను వివరించడంతో పాటు డేట్ల విషయంలో కూడా వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రానికి కార్తికేయ ఒక ప్రొడక్షన్‌ మేనేజర్‌ లా మారి వర్క్‌ చేస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల్లో టాక్‌ వినిపిస్తుంది. తండ్రి సినిమాకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటూ ఎప్పటికప్పుడు తన సాయం అందించే కార్తికేయ ఇన్వాల్వ్‌ మెంట్‌ తో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా విషయంలో జక్కన్న కు ఒత్తిడి ఉండదు. దాంతో మరోసారి రాజమౌళి బాహుబలి స్థాయి సినిమాను తీస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.
Tags:    

Similar News