రాజమౌళి మహాభారతంలో కృష్ణుడు అతనేనా?

Update: 2017-04-15 09:25 GMT
మహాభారతం.. రాజమౌళి కళల ప్రాజెక్టు. ఎప్పటికైనా ఆ సినిమా తీసి తీరుతాననే అంటున్నాడు జక్కన్న. ఐతే అందుకు సమయం పడుతుందంటున్నాడు. ‘బాహుబలి’తో సంపాదించిన అనుభవంతో ‘మహాభారతం’ తీసేస్తాడేమో అనుకుంటే.. అలాంటిదేం లేదు.. నేను ఇంకా అనుభవం సాధించాలంటున్నాడు. ఐతే ఈ లోపు ఆ సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో రాజమౌళి ఉన్నట్లే ఉన్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మహాభారతం మీద ఆసక్తి ప్రదర్శిస్తుండటం.. కృష్ణుడి పాత్ర చేయాలని ఉందని కూడా ప్రకటించడంతో రాజమౌళి ఇటీవలే అతడిని కలిసి ఈ సినిమా గురించి చర్చించాడట. స్వయంగా రాజమౌళే ఈ విషయాన్ని ద్రువీకరించాడు.

‘‘అవును. ఇటీవల అమీర్‌ ఖాన్ ను కలిశాను. మహాభారతం గురించి చర్చించాను. మహాభారతంలో నటించడానికి అమీర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు’’ అని రాజమౌళి తెలిపాడు. ఐతే ఇప్పటికిప్పుడు మహాభారతం చేసే ఉద్దేశం లేదని జక్కన్న మరోసారి స్పష్టం చేశాడు. మహాభారతం లాంటి కథను సినిమాగా తీయాలంటే మానసికంగా సిద్ధం కావాలని.. ఐతే ఎప్పటికైనా ఆ పురాణ గాథను సినిమాగా మలచడం మాత్రం గ్యారెంటీ అని తెలిపాడు. మహాభారతం కోసం రాజమౌళి గతంలోనే అమీర్.. అమితాబ్ బచ్చన్ లను కలిసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు మహాభారతం సినిమా మీద షారుఖ్ ఖాన్ కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఓ విదేశీ ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి ఈ సినిమాను నిర్మించాలని షారుఖ్ ఆశపడుతున్నాడు. ఆ సినిమాను సొంతంగా నిర్మించే స్థాయి తనకు లేదని.. దాన్ని విదేశీ సంస్థలతో కలిసి భారీ బడ్జెట్లో తెరకెక్కించాల్సి ఉందని షారుఖ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News