వాచ్ కోసం కోట్లు పెడుతున్న రాజమౌళి

Update: 2017-12-18 06:25 GMT
అదొక వాచ్. ఈకాలంలో మామూలు అనలాగ్ వాచీలు డిజిటాల్ వాచీల కంటే కూడా.. రకరకాలు ఫీట్లను చేసే స్మార్ట్ వాచీలు తెగు ఎక్కువైపోయాయ్. కేవలం టైమ్ చెప్పడానికే కాకుండా.. ఇమెయిల్ చూపించడం నుండి మనం నడుస్తుంటే ఎన్ని కాలరీలు ఖర్చు అయ్యాయో చెప్పడానికి కూడా ఈ వాచీలు సేవలు ఉపయోగుపడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక వాచ్ కోసం రాజమౌళి డబ్బులు పెడుతున్నాడు. అయితే తను కొనుక్కోవడానికి కాదు.. వాటిని తయారు చేసి జనాలకు విక్రయించడానికి.

చెన్నయ్ కు చెందిన కంజ్యూమెక్స్ అనే స్టార్టప్ కంపెనీలు.. దర్శకుడు రాజమౌళి మరియు బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఐఐటి మద్రాస్ కు చెందిన కొందరు కలసి.. ఈ స్టార్టప్ పెట్టి.. అక్కడ 'ఇంటర్నెట్ ఆఫ్‌ యు' అనే బ్రాండుతో కొన్ని పరికరాలను తయారు చేయనున్నారు. వాటిలో ఒక హైబ్రిడ్ స్మార్ట్ వాచ్.. కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు.. అలాగే గేమింగ్ కు సంబంధించిన వర్చువల్ రియాల్టి పరికరాలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ అయితే.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సంవత్సరం వరకు తిరిగి చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదట. ఈ కాన్సెప్టు నచ్చడంతో రాజమౌళి కూడా కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఫిబ్రవరికి.. 100 డాలర్లు (6600 రూపాయలు) ఖరీదు చేసే ఈ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి తీసుకొస్తారట. దానిని స్వయంగా రాజమౌళి లాంచ్ చేస్తాడని.. తెలుస్తోంది. అది సంగతి.
Tags:    

Similar News