సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దీని తర్వాత దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం నడవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నాడు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ మూవీని యూనివర్సల్ స్టోరీలైన్ తో వరుస సిరీస్ ల మాదిరి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం రాజమౌళి ఏకంగా హాలీవుడ్ స్టార్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నం మొదలుపెట్టారు. హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ తో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ మూవీలో కీలక పాత్రల కోసం హాలీవుడ్ నటులను తీసుకునే ప్రయత్నం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో సూపర్ స్టార్ కి ప్రతినాయకుడుగా హాలీవుడ్ స్టార్ హీరో, మిషన్ ఇంపాజిబుల్ హీరో టామ్ క్రూజ్ ని సంప్రదించినట్లు గత కొంతకాలంగా టాలీవుడ్ లో ప్రచారం నడుస్తుంది. అయితే ఇందులో ప్రతి నాయకుడు పాత్రను చేయడానికి టామ్ క్రూజ్ అంగీకరించలేదని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనే మాట ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసలు ఈ సినిమా కోసం టామ్ క్రూజ్ ని సంప్రదించనేలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
రాజమౌళి టీం నుంచి కూడా ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు చర్చి నడుస్తుంది. హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్న కూడా టామ్ క్రూజ్ ని సంప్రదించారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమాని రాజమౌళి మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా 15 నుంచి 20 కోట్లు బడ్జెట్ ని రాజమౌళి కేటాయిస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.