SSMB29: షూటింగ్ కంటే ముందే 20 కోట్లా?

Update: 2023-01-14 04:30 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమాని సిరీస్ గా తెరకెక్కించే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అంతర్జాతీయ వేదికల మీద జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడని చెప్పాడు. అలాగే అమెజాన్ అడవుల నేపధ్యంలో కథాంశం ఉండబోతుందని కూడా కాస్తా లీక్ ఇచ్చారు.

పాన్ వరల్డ్ లెవల్ లో ఈ సినిమాని ఆవిష్కరించడానికి రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నాడు.

దీని కోసం ఇప్పటికే ఓ హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నాడు. మార్వెల్ సిరీస్ లో నటించే నటులని ఈ మూవీ కోసం ఎంపిక చేస్తున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా నడుస్తుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి కథని సిద్ధం చేస్తున్న విజయేంద్రప్రసాద్ సూపర్ స్టార్ మూవీ మల్టీపుల్ సిరీస్ లలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.

దీనిని బట్టి కథపై ఈ సారి మరింత గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి పార్ట్ కోసం 300 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారని తెలుస్తుంది. నిర్మాత కెఎల్ నారాయణ ఇప్పటికే సినిమా కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.

ఇక ఈ ప్రీప్రొడక్షన్ కోసమే నిర్మాతతో ఏకంగా 15 నుంచి 20 కోట్ల వరకు దర్శకుడు రాజమౌళి ఖర్చు పెట్టినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇక ప్రీప్రొడక్షన్ వర్క్ లో భాగంగా క్యాస్టింగ్ సెలక్షన్, లొకేషన్స్ చూడటానికి ఆఫ్రికా కూడా రాజమౌళి వెల్లబోతున్నారు. అలాగే సినిమ స్టొరీని కాన్సెప్ట్ ఆర్ట్ గా సిద్ధం చేసి తాను ఎలా సినిమాని తీయబోయేది ముందుగానే విజువల్ గా సిద్ధం చేసుకునే పనిలో జక్కన్న పడ్డారు. వీటికోసమే ఓ మినిమమ్ బడ్జెట్ సినిమాకి పెట్టిన పెట్టుబడి నిర్మాతతో పెట్టిస్తున్నట్లు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News