ఐట‌మ్ భామ‌గా ముద్ర వేసి ప‌క్క‌న పెట్టారా?

Update: 2021-02-11 00:30 GMT
బాహుబ‌లి మ‌నోహ‌రిగా ప్ర‌పంచానికి సుపరిచితం నోరా ఫ‌తేహి. ఈ కెన‌డియ‌న్ బ్యూటీ డ్యాన్సుల‌కు వీరాభిమానులున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఐటెమ్ భామ‌గా స‌త్తా చాటిన నోరా సౌత్ లోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నోరా డ్యాన్స‌ర్ మాత్ర‌మే కాదు మంచి న‌టి కూడా. కానీ త‌న ప్ర‌తిభ‌కు త‌గ్గ అవ‌కాశాలు రావ‌డం లేదన్న ఆవేద‌న తన‌లో ఉంది.

ఇటీవ‌ల దిల్ బర్ .. కమరియా.. ఓ సాకీరే లాంటి మత్తైక్కించే పాట‌ల‌కు అదిరిపోయే నృత్యాలు చేసింది. ఆ పాట‌ల‌న్నీ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తూ అద్భుత‌మైన వ్యూస్ ని అందుకున్నాయి. తాజా సింగిల్ 'చోర్ డెంగే' కొన్ని గంటల్లోనే 5 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.  ఏబీసీడీ- స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర‌లో అద్భుత నృత్య విన్యాసాల‌తో నోరా క‌ట్టి ప‌డేసింది.

సాటి నర్త‌కుల‌తో పోలిస్తే నోరా బాడీలో స్వింగ్ ఎక్కువ‌. పోల్ డ్యాన్స్.. ర్యాప్ డ్యాన్స్ .. వెస్ట్ర‌న్.. క్లాసికల్ ఇలా ఏదైనా అద‌ర‌గొడుతుంది. అయితే న‌టిగా తాను మాత్రం అస్స‌లు సంతృప్తిగా లేద‌ని ప్ర‌తిసారీ ఓపెన‌వుతోంది. త‌న‌లోని న‌టిని సంతృప్తి చేసే అవ‌కాశం ఏదీ రాలేద‌ని నోరా చెబుతోంది. పూర్తి స్థాయి క‌థానాయిక‌గా స‌త్తా చాటాల‌నుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల‌కు ఫీల‌ర్స్ వ‌దులుతోంది. కానీ ఎందుక‌నో స‌రైన ఆఫ‌ర్ రావ‌డం లేదు. ఇక సెంటిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌సారి ఐటెమ్ భామ‌గా అవ‌కాశమిచ్చాక క‌థానాయిక‌గా ఆఫ‌ర్ ఇవ్వ‌డం అన్న‌ది చాలా క‌ష్ట‌మే. అలాగే త‌నకు హిందీ భాష రాక‌పోవ‌డం కూడా ఒక ర‌కంగా మైన‌స్సే. ‌ అయితే వెబ్ సిరీస్ ల‌తో త‌న ఆక‌లి తీర్చుకునే వీలుందేమో చూడాలి.
Tags:    

Similar News